మన భారత దేశంలో ఎన్నో పురాతన దేవాలయాలు, పుణ్య క్షేత్రాలు ఉన్నాయి.ఈ పురాతన దేవాలయాలకు పుణ్య క్షేత్రాలకు ప్రతి రోజు ఎన్నో వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామి వారికి పూజలు, అభిషేకాలు( Pujas , Abhishekals ) నిర్వహిస్తూ ఉంటారు.
అలాగే మరి కొంత మంది భక్తులు భగవంతునికి కానుకలను సమర్పించి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే భారతదేశం లో సాంప్రదాయాలు పాటించే వారు చాలా మంది ఉన్నారు.
అలాగే మ నదేశంలోని ప్రజలకు ప్రతి పనికి ఒక పద్ధతి కచ్చితంగా ఉంటుంది.ఆ పద్ధతి ప్రకారమే ఆ పనులను చేస్తూ ఉంటారు.అలాగే దేవుళ్లకు చేసే పూజల నుంచి మొదలుపెట్టి తినే భోజనం వరకు అన్ని పనులను కొన్ని నియమాలతో మొదలుపెట్టి ముగిస్తూ ఉంటారు.అలాగే చివరలో దేవుడుకి హారతి( Harati ) ఇచ్చామంటే పూజా సంపూర్ణం అయినట్లే అని పండితులు చెబుతున్నారు.
అయితే ఎప్పుడైనా దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు చాలా మంది చూసి ఉంటారు.
అయితే ఖచ్చితంగా మాత్రం గమనించి ఉండరు.ఇంకా చెప్పాలంటే హారతి ఇచ్చే సమయంలోనే గంటను కూడా మ్రోగిస్తు ఉంటారు.దేవుడికి హారతి ఇచ్చి ఆ హారతి నీ భక్తులందరూ కళ్ళకు అద్దుకొని నమస్కారం చేస్తూ ఉంటారు.
కొన్ని ప్రదేశాలలో అయితే శంఖాన్ని కూడా ఊదుతు ఉంటారు.అలాగే గంటలు, శంఖం శబ్దం( Bells, conch sound ) వల్ల మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా పూర్తిగా భగవంతుడి పై మనస్సు లగ్నం చేయవచ్చు అని పండితులు చెబుతున్నారు.
అలాగే శరీరంలో కొత్త ఉత్సవం కలుగుతుందని కూడా పండితులు చెబుతున్నారు.అందుకే పూజా చివరిలో హారతి అనేది ఇస్తారని చెబుతున్నారు.
ఇలా చివరిలో హారతి ఇవ్వడం వలన పూజ పూర్తవుతుందని పండితులు చెబుతున్నారు.