తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు మరి కాసేపట్లో కీలక సమావేశం నిర్వహించనున్నారు.మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాసంలో భేటీ కానున్న నేతలు బీసీ డిక్లరేషన్ లో భాగంగా చర్చించాల్సిన విషయాలపై ప్రధానంగా చర్చలు జరిపే అవకాశం ఉంది.
అదేవిధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే మొత్తంగా 34 సీట్లను బీసీలకు ఇవ్వాలని నేతలు కోరుతున్నారు.
బీసీ గణనపై సమగ్ర సర్వే చేయించిన కేసీఆర్ ఆ ఫలితాలను ఇంతవరకూ ప్రజల ఎదుటకు తీసుకురాలేదని మాజీ మంత్రి పొన్నాల విమర్శించారు.ఈ క్రమంలో రాష్ట్రంలోని ఓబీసీలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.