ఇల్లు లేదా వ్యక్తి జీవితం నుంచి ప్రతికూల శక్తిని దూరం చేసే అనేక విషయాలు వాస్తు శాస్త్రంలో ఉన్నాయని దాదాపు చాలా మందికి తెలుసు.ఇంట్లో వస్తువులను సరైన దిశలో లేదా సరైన స్థలంలో ఉంచితేనే సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది.
అంతేకాకుండా లక్ష్మీదేవి( Lakshmi Devi ) ఆనందం మరియు శ్రేయస్సును ఇస్తుంది.ఏ వస్తువునైనా ఇంట్లో ఉంచడానికి మంచి దిశా చాలా ముఖ్యమని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
అయితే మనం కూడా ఈ విషయాలను ఎప్పటికప్పుడు విస్మరిస్తూనే ఉంటాము.చాలామంది తమ పిల్లల ఫోటోలను ఇంటి గోడలపై ఉంచుతారు.

దాంతో వారి బాల్యాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు.అయితే ఫోటో పెట్టేటప్పుడు చేసే చిన్న పొరపాటు కూడా మీకు చాలా నష్టాన్ని కలిగిస్తుందని దాదాపు చాలామందికి తెలియదు.అలాగే ఫోటోలను గోడలపై ఉంచడానికి వాస్తు శాస్త్రం( Vastu shastra )లో కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి.వీటిని దృష్టిలో ఉంచుకొని ఇంట్లో పిల్లల ఫోటోలు పెడితే ఆ ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
అలాగే కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ పెరుగుతుంది.ఫోటోలను ఎలా, ఎక్కడ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పశ్చిమ దిశ పిల్లలు మరియు సృజనాత్మక సంబంధించినది.అందుకే పశ్చిమ దిశ పిల్లల ఫోటోలు పెట్టడానికి మంచిదనీ నిపుణులు చెబుతున్నారు.ఈ దిశలో ఫోటోలు ఉంచడం వల్ల చదువులో మరింత పదును పెట్టి జీవితంలో ముందుకు సాగుతారు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీకు ఒకే కొడుకు ఉంటే అతని ఫోటోను దక్షిణం వైపు పెట్టాలి.
దీంతో మీ అబ్బాయి బాధ్యుడు అవుతాడు.మొత్తం కుటుంబాన్ని చూసుకునే ధైర్యం అతనికి వస్తుంది.
మీరు మీ పిల్లల ఫోటోను తూర్పు దిశలో ఉంచినట్లయితే అది పిల్లలను ప్రకాశవంతంగా మరియు శక్తివంతంగా మారుస్తుందని జ్యోతిష్య శాస్త్రం( Astrology ) చెబుతూ ఉంది.అలాగే భగవంతుని అనుగ్రహం వారిపై ఎప్పుడూ ఉంటుంది.