ఎన్టీఆర్ రామ్ చరణ్ లాంటి స్టార్స్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సినిమా RRR (రౌద్రం రణం రుధిరం).ఈ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి కలెక్షన్ల మోత మోగిస్తోంది.
థియేటర్లన్నీ ప్రేక్షకుల రాకతో సందడిగా మారి ఏ థియేటర్ దగ్గర చూసినా పండుగ వాతావరణం కనిపిస్తుంది.అలాగే, రివ్యూలు కూడా ఈ సినిమాకు పాజిటివ్‌గానే వచ్చాయి.
అందుకే కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల వసూళ్లను రాబట్టింది.
దానికి కారణాలు చాలా ఉన్నాయి.
మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ – రామ్ చరణ్ ల పరిచయ సన్నివేశాలు, ట్రైన్ ఎపిసోడ్, ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.వీటితో పాటు సినిమాటోగ్రఫి, బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ ఇలా సినిమాలోని ఎన్నో అంశాలు ప్రేక్షకులకు కూడా బాగా నచ్చాయి.
అసలు జక్కన్న ఒక మాయ ప్రపంచాన్ని క్రియేట్ చేసి మనకు చూపిస్తున్నట్లుగా ఉంటుంది ఈ RRR సినిమా.

అంతేకాదు ఈ సినిమాలోని పాటలు కూడా సినిమాకి ఎంతో ప్లస్ అయ్యాయి.మరీ ముఖ్యంగా ‘కొమరం భీముడో‘ సాంగ్ కీ ఏ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ పాటని సింగర్ కాల భైరవ ప్రాణం పెట్టి పాడాడు.
దీనికి సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ మరింత బలాన్నిచ్చాయి.ఇక ఈ పాటలో ఎన్టీఆర్ పలికించిన ఎమోషన్స్, చరణ్ చూపించిన క్రుయాలిటీ పాటను ఇంకా హైలైట్ చేసాయి.
అయితే సాధారణంగా రాజమౌళి తెరకెక్కించిన ఏ సినిమాకైనా ప్రశంసలు ఎలా దక్కుతాయో.విమర్శలు కూడా అలాగే వస్తుంటాయి.
దీంతో పాటు కాపీ ఆరోపణలు కూడా వస్తుంటాయి.ఇలా ఇప్పటికే చాలా సినిమాలకు జరిగింది.
ఈ క్రమంలోనే ఇప్పుడు RRR మూవీలోని కొమరం భీముడో సాంగ్ కూడా కాపీనే అంటూ విమర్శలు వస్తున్నాయి.

ఓ జానపద గీతానికి చెందిన ట్యూన్ లో పదాలను మార్చేసి ఈ పాటని రాసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.తెలంగాణ జానపద గీతమైన “మదనా సుందరి” పాటనే కొంచం మార్చేసి “ కొమరం భీముడో” పాటని రాశారట.జానపద గీతాలలోని ఈ పాటని గద్దర్ పాడారు.
ఆ తరువాత ఈ పాట “రేలా రే” అనే షో లో కూడా పాడినట్టుగా తెలుస్తుంది.ఇక ఈ పాట టేకింగ్ కూడా రాజమౌళి గారు… కమల్ హాసన్ దశవతారం సినిమాలోని “రాయిని మాత్రం కంటే” అనే పాటను కాపీ కొట్టారని కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
మరీ ఈ వార్తలపై RRR టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.