కమింగ్ ఆఫ్ ఏజ్ రొమాంటిక్ కామెడీ సినిమా స్టాండప్ రాహుల్ ఆహాలో డిజిటల్ స్ట్రీమింగ్‌కి సిద్ధమవుతోంది.ఈ సినిమాతో శాంటో దర్శకుడిగా పరిచయమయ్యారు.
నందకుమార్ అబ్బినేని, భరత్ మగులూరి సంయుక్తంగా నిర్మించారు.రాజ్‌తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన సినిమా ఇది.స్వీకర్ అగస్తి స్వరాలు సమకూర్చారు.ఏప్రిల్ 8 నుంచి ఆహాలో వరల్డ్ ప్రీమియర్ కానుంది.
ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ సినిమా ఇది.జీవితంలో తనకు నచ్చిందైనా, తనకు కావాల్సిందైనా నిలబడి సాధించుకుందామనే ఆలోచన లేని ఓ అబ్బాయికి నిజమైన ప్రేమ ఎదురైతే ఏం జరిగింది? తన తల్లిదండ్రుల కోసం, తాను ప్రేమించిన అమ్మాయి కోసం, తన ప్యాషన్ కోసం అతనేం చేశాడు? అతని జీవితంలో స్టాండప్ కామెడీకి ఉన్న రోల్ ఏంటి? అనేది ఆసక్తికరం.ఇంద్రజ, వెన్నెలకిశోర్, మురళీశర్మ కేరక్టర్లు సినిమాలో అలరిస్తాయి.ఆహా ప్లాట్‌ఫార్మ్ లో ఇటీవల భీమ్లానాయక్, డీజే టిల్లు, తెలుగు ఇండియన్ ఐడల్, సెబాస్టియన్, కుబూల్ హై, అర్జున ఫల్గుణ, హే జూడ్, ది అమెరికన్ డ్రీమ్, లక్ష్య, సేనాపతి, త్రీ రోసెస్, మంచి రోజులొచ్చాయి, రొమాంటిక్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, భామాకలాపం, అనుభవించు రాజా, సర్కార్, చెఫ్ మంత్ర, అల్లుడు గారు, క్రిస్మస్‌తాతతో పాటు ఇంకా ఎన్నెన్నో విడుదలయ్యాయి.
ఆహా టాక్ షో నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్.ఐఎండీబీ రేటింగుల్లో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది.