మీకు విపరీతమైన జుట్టు రాలే సమస్య ఉందా? అయితే చింతించాల్సిన అవసరం లేదు.ఎటువంటి కాస్మొటిక్స్ జోలికి వెళ్లకుండా ఇంటి చిట్కాలతో ఈ సమస్య నుండి సక్సెస్ గా బయట పడవచ్చు.
వీటికి అవసరమైన వస్తువులు కూడా మనకు ఇంటిలో అందుబాటులో ఉంటాయి.ఈ చిట్కాకు ఉల్లిపాయ,తేనే,ఎసెన్షియల్ ఆయిల్ అవసరం అవుతాయి.
ఉల్లిపాయలో సల్ఫర్ అధికంగా ఉండుట వలన జుట్టు బ్రేక్ అవ్వకుండా జుట్టు రాలకుండా చేస్తుంది.అంతేకాక జుట్టు పెళుసుగా మారకుండా కూడా సహాయపడుతుంది.తలకు ఉల్లిపాయ గుజ్జు లేదా రసాన్ని రాయటం వలన జుట్టు ఫాలీసెల్స్ కు పోషణ అందుతుంది.ఉల్లిపాయ తలలో దురదను నివారిస్తుంది.
ఎసెన్షియల్ ఆయిల్ లో ఉండే పోషకాలు చర్మం మీద బాగా పనిచేసి జుట్టుకు రక్షణ ఇస్తాయి.అంతేకాక చుండ్రు,పేల సమస్యను తగ్గిస్తాయి.ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ కోసం రెసిపీని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్ధాలు
ఉల్లిపాయలు 4తేనే అరకప్పుఎసెన్షియల్ ఆయిల్ 4 చుక్కలు
ఉల్లిపాయలను తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి మిక్సీలో మిక్సీ చేసి రసాన్ని తీయాలి.ఈ రసంలో తేనే,ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా కలపాలి.తేనే,ఉల్లి రసం బాగా కలవటానికి కొంత సమయం పడుతుంది.ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 45 నిమిషాల పాటు మసాజ్ చేసి రాత్రంతా ఆలా వదిలేసి మరుసటి రోజు ఉదయం తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.