సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న నయనతార ఒకప్పుడు గ్లామర్ పాత్రల్లో నటించి తన అందచందాలతో ప్రేక్షకులను మైమరిపించింది నయనతార.ఇప్పుడు మాత్రం అటు కేవలం లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలలో మాత్రమే నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఇక ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా దూసుకుపోతుంది ఈ అమ్మడు.అయితే ఎన్ని సినిమాలు చేసినా అటు నయన్ ఖాతాలో ఒక సాలిడ్ హిట్ మాత్రం ఈ మధ్య కాలంలో లేదు అని చెప్పాలి.
అంతేకాదండోయ్ కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి కూడా అటు నయనతార ఎన్నో లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించింది.ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.
కానీ సినిమాలు మొత్తం థియేటర్లలో విడుదలకు నోచుకోవడం లేదు.చివరికి అటూఓటిటి లోనే విడుదల అవుతూ ఉండటం గమనార్హం.2020 లో వచ్చిన ముక్కుతి అమ్మాన్, 2021 లో వచ్చిన నెట్రికన్ ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా విడుదల అయ్యాయి.ఈ ఏడాది కూడా మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది నయనతార.
02 అనే పేరుతో కోలీవుడ్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది అనేది తెలుస్తుంది.ఎనిమిదేళ్ళ పిల్లాడికి తల్లిగా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించబోతుంది నయనతార.అయితే ఈ సినిమా కూడా ఓటిటి లోనే విడుదల కాబోతుంది అని తెలుస్తోంది.ఎప్పటిలాగానే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుందట.
ఇప్పటివరకు నయన్ సినిమాలు ఓటిటి విడుదలైన పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.మరి ఇప్పుడు అదే ఓటిటి బాట పడుతున్న మరో లేడీ ఓరియంటెడ్ సినిమా అయినా హిట్ అవుతుందో లేదో చూడాలి.