ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రకటనలపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇటువంటి ప్రభుత్వాన్ని ఇటువంటి చేతకాని ముఖ్యమంత్రిని గతంలో ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు ప్రతిపక్షాలను దమ్ముందా అని ముఖ్యమంత్రి ప్రశ్నించడం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికే దమ్ము లేదని తెలుస్తుందని ఆయన అన్నారు.
ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేసిన పొత్తులతో పోటీ చేసిన ఎవరి రాజకీయ వ్యూహం వారికి ఉంటుందని అన్నారు.
జనసేన నేతల పైన కార్యకర్తల పైన ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని అటువంటి తప్పుడు విధానాలను మానుకోవాలని సూచించారు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇటీవల మరణించిన జనసైనికుల కుటుంబ సభ్యులకు భీమా చెక్కులను మనోహర్ అందజేశారు.పార్టీ కుటుంబ సభ్యులందరికీ జనసేన అండగా ఉంటుందని మనోహర్ పేర్కొన్నారు.