బాలకృష్ణ ఆహాలో చేస్తున్న అన్ స్టాపబుల్ షో సూపర్ హిట్.ఇందులో ఎలాంటి సందేహం లేదు.
మొదటి సీజన్ సెలబ్రిటీలతో సరదాగానే గడిచింది.బాలయ్య మార్కు పంచులు, అవతల స్టార్స్ కి కౌంటర్లు .అబ్బో షో బాగానే రక్తి కట్టింది.ఇక రెండో సీజన్ కూడా వచ్చింది.
నిజానికి జనాల్లో ప్రోమోలతో విపరీతమైన క్రేజ్ క్రియేట్ చేయడం లో ఆహా క్రియేటివ్ టీమ్ సక్సెస్ అయ్యారు.కానీ ఆ క్రేజ్ కి సరిపడా సర్వర్ మెయింటనెన్స్ లేకపోవడం తో క్రాష్ అయ్యి ఆ ఎపిసోడ్ చూడాలి అనుకున్న వారు ఇరిటేట్ అయ్యారు.
ఈ సంగతి పక్కన రెండవ సీజన్ కి వచ్చే సరికి కాస్త ఎదో ఒక తెలియని కన్ఫ్యూజన్ మొదలయ్యింది ఈ షో లో.
చంద్ర బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి స్టార్స్ ఎపిసోడ్ తో రాజకీయాలు, సినిమా కలిపేసి గందర గోళం చేసారు.ఇక రెండవ సీజన్ కూడా ముగిసింది.ఆహ మంచి లాభాలను చూసింది కానీ ఇక మరొక సీజన్ ప్రారంభించడానికి అసలు సమస్య మొదలయ్యింది.
ఈ సారి బాలకృష్ణ స్థానం లో పవన్ కళ్యాణ్ ని తీసుకొని షో రన్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో పడ్డారు ఆహా యాజమాన్యం .పైగా ఇంటి అల్లుడు ఎంత ఇచ్చిన చేస్తాడు కాబట్టి ఆహ కు కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది.మరో వైపు పవన్ కళ్యాణ్ కూడా దీనికి నో చెప్పకపోవచ్చు.
ఎందుకంటే ఈ షో ని ఈ సారి రెగ్యులర్ గా కాకుండా అమీర్ ఖాన్ చేసినట్టు సత్యమేవ జయతే తరహాలో ప్లాన్ చేయనున్నారట.ఒక వేళా ఇలా చేస్తే అది పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ కి మైలేజ్ ఇచ్చే అవకాశం లేకపోలేదు.సాధారణ జనాల్లో కూడా ఈ షో మంచి క్రేజ్ ని దక్కించుకుంటుంది.
బాలకృష్ణ ఉన్న కొన్ని ఇబ్బందులు పవన్ కళ్యాణ్ తో ఉండవు.ఇలా గాడి తప్పి ఏటేటా వెళ్తున్న అన్ స్టాపబుల్ షో పవన్ కళ్యాణ్ రాకతో మరింత హైలెట్ అయ్యే అవకాశం ఉంది.
కమర్షియల్ గా కూడా అటు అల్లు వారికి ఇటు పవన్ కళ్యాణ్ కి బాగా ఉపయోగపడే ఛాన్స్ కూడా ఉంది.దీని పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపం లో మాకు తెలియచేయండి.