అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు ప్రముఖ సినీ హీరో శివాజీ మద్దతు తెలిపారు.ఈ యాత్ర కందుకూరు నియోజకవర్గంలో రెండు రోజుల నుండి కొనసాగుతుంది.
అయితే గురువారం వాతావరణం సహకరించకపోవడంతో విరామం ప్రకటించారు.శుక్రవారం యధావిధిగా గుడ్లూరు గ్రామం నుండి ప్రారంభం కానుంది.
అమరావతి రైతులు చేస్తున్న నాయస్థానం టు దేవస్థానం పేరుతో మహా పాదయాత్ర కు మద్దతుగా సినీ నటుడు హీరో శివాజీ గుడ్లూరు వచ్చి అమరావతి రైతన్నలను కలిసి పరామర్శించారు.
వారి పోరాటానికి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా హీరో శివాజీ మాట్లాడుతూ అమరావతి నిర్మాణం పూర్తి చేసి రాజధానిగా ప్రకటిస్తే భవిష్యత్తు తరాలకు ఒక సింహా స్వప్నంగ నిలుస్తోంది అన్నారు.అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని ఆయన కోరారు.
దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా మన రాష్ట్రమే ఉందని తెలిపారు.న్యాయస్థానాల సాక్షిగా రైతులు చేస్తున్న మహా పాదయాత్ర దేవుడు పరిశీలించి అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించేలా ఈ పాలకులకు బుద్ధి ప్రసాదించాలని కోరుతున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శివరాం, ఇంటూరి రాజేష్, ఇన్నమూరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.