రాజన్న సిరిసిల్ల జిల్లా: మద్యం సేవించి ఎవరు కూడా వాహనాలు నడపవద్దని అధికంగా రోడ్డు ప్రమాదాలు మద్యం సేవించి వాహనాలు నడపవలనే ప్రాణాలు పోవడం జరుగుతుందని ఎస్సై శ్రీరామ్ ప్రేమ్ దీప్ అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఎక్స్ రోడ్ వద్ద ఎస్సై తన సిబ్బందితో వాహన తనిఖీ తో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ ను నిర్వహించారు.
ఈ వాహన తనిఖీలలో సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడిపినట్లు నిర్ధారణ కాగా వారి పైన కేసు నమోదు చేశామని వారు అన్నారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ… ఈ మధ్యకాలంలో అధికంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ సరైన ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వలన రోడ్డు ప్రమాదాలు సంభవించి మరణాలు ఎక్కువగా అవుతున్నాయని అన్నారు.
కావున ప్రతి వాహనదారులు సరైన ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకొని వాహనాలు నడపాలని అలాగే మద్యం సేవించకుండా వాహనాలు నలపాలని వాహనదారులకు ఎస్ఐ విజ్ఞప్తి చేశారు.ఈ వాహన తనిఖీలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.