వెయిట్ లాస్ అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారా? కష్టమైన డైట్ ను ఫాలో అవుతున్నారా.? రోజు వ్యాయామాలు చేస్తూ చెమటలు చిందిస్తున్నారా.? అయితే కచ్చితంగా మీరు ఇప్పుడు చెప్పబోయే పాలు తీసుకోవాల్సిందే.ఈ పాలు రోజుకు ఒక గ్లాస్ చొప్పున తీసుకుంటే వేగంగా వెయిట్ లాస్ అవ్వడమే కాదు మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతమవుతాయి.
మరి ఇంతకీ ఆ పాలు ఏంటి.ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ ను తీసుకుని అందులో పది నుంచి పన్నెండు బాదంపప్పులు వేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి.అలాగే మరొక గిన్నెలో ఐదు జీడిపప్పు, వన్ టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు , మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు బ్లెండర్ తీసుకుని అందులో నైట్ అంతా నానబెట్టుకున్న జీడిపప్పు, గుమ్మడి గింజలు, ఖర్జూరాలు వేసుకోవాలి.
అలాగే బాదం పప్పుకు ఉన్న పొట్టును తొలగించి బ్లెండర్ లో వేయాలి.
చివరిగా వన్ టేబుల్ స్పూన్ వేయించిన అవిసె గింజలు, ఒకటిన్నర టేబుల్ స్పూన్ పీనట్ బటర్ మరియు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సీడ్స్ అండ్ నట్స్ మిల్క్ సిద్ధమవుతోంది.
ఈ మిల్క్ రుచిగా ఉండడమే కాదు ఆరోగ్యానికి బోలెడన్ని పోషకాలు అందిస్తుంది.ఈ మిల్క్ ను రోజుకొక గ్లాసు చొప్పున ప్రతిరోజు కనక తీసుకుంటే శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ లభిస్తుంది.
అదే సమయంలో మెటబాలిజం రేటు అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.
దీంతో క్యాలరీలు త్వరగా బర్న్ అవుతాయి.ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.అలాగే ఈ మిల్క్ ను తీసుకోవడం వల్ల బిపి కంట్రోల్ లో ఉంటుంది.
గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.నీరసం అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.
ఎముకలు కండరాలు దృఢంగా తయారవుతాయి.మెదడు సూపర్ షార్ప్ గా సైతం మారుతుంది.
కాబట్టి వెయిట్ లాస్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న వారే కాదు ఎవ్వరైనా ఈ సీడ్స్ అండ్ నట్స్ మిల్క్ ను డైట్ లో చేర్చుకోవచ్చు.