దక్షిణాభిముఖంగా ప్రవహించే గోదావరి నదీతీరంలో వెలసిన ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహ ఆలయం నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతోంది.దక్షిణ కాశీగా, తీర్థ రాజంగా, హరిహర, క్షేత్రంగా విరాజిల్లుతోంది.
దేశంలో మరెక్కడా లేని విధంగా ఆలయ ప్రాంగణంలో యమధర్మ రాజు కోవెల ఉంది.ఈ కారణంగానే ‘ధర్మపురికి వస్తే యమపురి ఉండదనే నానుడి ప్రసిద్ధి చెందింది.
స్థలపురాణం.ధర్మవర్మ అనే మహారాజు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పాలించడం వల్లే ధర్మపురి అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.
వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం క్రీ.శ.1422-33 కాలంలో బహమనీ సుల్తానుల దండ యాత్రలో ధ్వంసం అయింది.
తిరిగి ఈ ఆలయాన్ని 17వ శతాబ్దంలో పునరుద్ధరించినట్లు కళ్ళపురి క్షేత్ర చరిత్ర తెలియజేస్తోంది.
పామునే పతిగా పొందిన సత్యవతీదేవి ఎన్ని గుళ్లూ గోపురాలూ తిరిగినా ఫలితం కనిపించలేదు.చివరికి ధర్మపురికి వచ్చి నృసింహ స్వామిని దర్శించుకుందట.గోదావరిలో స్నానం ఆచరించగానే సత్యవతీ దేవి భర్తకు సర్పరూపం పోయి సుందర రూపం వచ్చినట్లు స్థల పురాణం తెలుపుతోంది.అందువల్లే ధర్మపురిని దర్శించిన వారికి యమపురి ఉండదన్న నానుడి వచ్చిందని స్థానికుల విశ్వాసం.
చారిత్రకంగానూ ఈ ప్రాంతం ప్రసిద్ధి పొందింది.ధర్మపురి పట్టణం వేదాలకూ, ప్రాచీన సంస్కృతికీ, సంగీత సాహిత్యాలకూ పుట్టినిల్లుగా పేరుగాంచింది.బ్రహ్మలు సన ఆలయం ( స్తంభం) ప్రసిద్ధి చెందింది.స్వామివారిని దర్శిస్తే మానసిక, శారీరక బాధల నుంచి విముక్తి లభిస్తుందనీ, ఆయురారోగ్య, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయనీ భక్తుల విశ్వాసం, దేవస్థానంలో పక్కపక్కనే ఉన్న ఉగ్ర, యోగ స్వాముల ఆలయాలతో పాటు, శ్రీవేంకటేశ్వర గోపాలస్వామి గుళ్లూ, ముందు భాగంలో శ్రీరామలింగేశ్వరుడి కోవెలా ఉన్నాయి.
LATEST NEWS - TELUGU