Achal Saptami: అచల సప్తమి రోజున ఈ నియమాలు పాటించాలి..!

హిందూ క్యాలెండర్( Hindu Calendar ) ప్రకారం మాఘమాసం నుండి శుక్లపక్షంలోని ఏడవ రోజున అచల సప్తమి( Achal Saptami ) అని అంటారు.పౌరాణిక విశ్వాసాల ప్రకారం ఈ రోజున సూర్య భగవానుడు తన దివ్యకాంతి మొత్తం విశ్వాన్ని ప్రకాశింప చేశాడని పండితులు చెబుతున్నారు.

 Follow These Rules On Achal Saptami-TeluguStop.com

పురాణాలలో సప్తమి తిథి సూర్య భగవానుకి సంబంధించినదిగా చెబుతారు.ఈ రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం, దానాలు చేయడం వలన ఏడు జన్మల పాపాల నుండి విముక్తి పొందుతారని కూడా పండితులు చెబుతున్నారు.

పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్షంలోని సప్తమి తిథిలో రోజున ఉదయం 10: 13 గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి 16వ తేదీన ఉదయం 8:54 గంటల వరకు కొనసాగుతుంది.

Telugu Achal Saptami, Bakthi, Devotional, Hindu Calendar, Lord Surya, Salt-Lates

అయితే ఫిబ్రవరి 16వ తేదీన సప్తమి తిథి సూర్యోదయం కానుంది.కాబట్టి ఫిబ్రవరి 16వ తేదీన అచల సప్తమి వ్రతాన్ని కూడా ఆచరిస్తారు.ఈ రోజున నది స్నానం చేయడానికి అనుకూలమైన సమయం 5:15 నుండి 6:59 వరకు ఉంటుంది.ఇక ఎవరైతే ఆ రోజున ఉప్పు తినకుండా రోజంతా పండ్లను తింటారో, ఆ సంవత్సరమంతా ఒక్కసారి సూర్య భగవానుని( Lord Surya ) పూజించిన పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి.అంతేకాకుండా జాతకంలో సూర్యుని స్థానం బలంగా ఉండడం వలన శుభ ఫలితాలు కూడా లభిస్తాయి.

ఇక తొమ్మిది గ్రహాలకు రాజు అయిన సూర్యుని బలమైన స్థానం కారణంగా ప్రభుత్వ రంగం అధికారి వర్గం ప్రతిష్ట సామాజిక శ్రేయస్సు లాంటి వాటిపై సూర్యుని నుండి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి.

Telugu Achal Saptami, Bakthi, Devotional, Hindu Calendar, Lord Surya, Salt-Lates

ఈ ఉపవాస ప్రభావం వలన మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.భవిష్య పురాణంలో అచల సప్తమి రోజున ఉప్పు( salt ) తీసుకోవడం నిషేధం.అలాగే ఉప్పు లేకుండా ఉపవాస ఆచరిస్తే ఈ ఉపవాసం చాలా రెట్లు ప్రయోజనకరంగా ఉంటుంది.

ఈ వ్రతాన్ని ఆచరించడం వలన జాతకంలో శుభ ఫలితాలు పొందవచ్చు.ఇక అచల సప్తమి రోజున పుణ్యస్నానం చేస్తే చేసి ఆ తర్వాత సూర్యుడికి దీప దానం చేయడం చాలా ఉత్తమం.

ఇక ఈ రోజున మాంసాహారం, మద్యం సేవించకూడదు.అలాగే సంపూర్ణ బ్రహ్మచర్యంతో పాటు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube