భారతీయ సంస్కృతిలో భాగమైన ఆలయాలు ప్రపంచవ్యాప్తంగానూ కనిపిస్తాయి.ముఖ్యంగా శివుని ఆలయాలు చాలా దేశాల్లో కనిపిస్తాయి.
కొన్ని దేవాలయాలు ఆ దేశాలలో ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా మారాయి.విదేశాలలో శివుని ఆలయాలు చాలా ఉన్నాయి.
ఈ ఆలయాలను భారతీయ భక్తులే కాకుండా విదేశీయులు కూడా సందర్శిస్తుంటారు.ఇప్పుడు మనం విదేశాలలో నిర్మితమైన అద్భుతమైన శివుని ఆలయాల గురించి తెలుసుకుందాం.1.శివ హిందూ దేవాలయం, జుయిడోస్ట్ ఆమ్‌స్టర్‌డామ్
ఈ ఆలయం దాదాపు 4,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
ఈ ఆలయ తలుపులు జూన్ 2011న భక్తుల కోసం తెరుచుకున్నాయి.ఈ ఆలయంలో శివుడితో పాటు గణేశుడు, దుర్గాదేవి, హనుమంతుడు కూడా కొలువై పూజలందుకుంటారు.ఇక్కడ శివుడు పంచముఖి శివలింగ రూపంలో దర్శనమిస్తాడు.
2.
అరుల్మిగు శ్రీ రాజకాళియమ్మన్ ఆలయం, జోహోర్ బహ్రు, మలేషియా
ఈ ఆలయాన్ని దాదాపు 1922 సంవత్సరంలో నిర్మించారని చెబుతారు.ఈ ఆలయం జోహోర్ బహ్రులోని పురాతన దేవాలయాలలో ఒకటి.ఈ ఆలయం నిర్మితమైన భూమిని జోహార్ బారు సుల్తాన్ భారతీయులకు బహుమతిగా ఇచ్చారు.కొంతకాలం క్రితం వరకు ఈ ఆలయం చాలా చిన్నదిగా ఉండేది, కానీ నేడు ఇది భవ్యమైన దేవాలయంగా మారింది.ఆలయ గర్భగుడిలో దాదాపు 3,00,000 ముత్యాలను గోడపై అతికించి అలంకరించారు.
3.మున్నేశ్వర ఆలయం, మున్నేశ్వరం, శ్రీలంకఈ ఆలయ చరిత్ర రామాయణ కాలంతో ముడిపడి ఉంది.హిందువుల విశ్వాసాల ప్రకారం, రావణుడిని చంపిన తర్వాత రాముడు ఈ ప్రదేశంలో శివుడిని పూజించాడని చెబుతారు.
ఈ ఆలయ సముదాయంలో ఐదు ఆలయాలు ఉన్నాయి, వాటిలో అతిపెద్ద, అందమైన ఆలయం శివుడిది.పోర్చుగీసువారు ఈ దేవాలయంపై దాడి చేసి రెండుసార్లు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని చరిత్ర చెబుతోంది.
DEVOTIONAL