మొన్నటి వరకు కరోనా వైరస్ కారణంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు వైరస్ ప్రభావం తగ్గడంతో మళ్లీ పూర్వ వైభవంతో కళకళలాడిపోతోంది.బాక్సాఫీస్ వద్ద వరుస సినిమాలు రిలీజ్లు.వసూళ్లలో రికార్డులు.ఇలా సందడి ఉండగా.అటు హీరోలు వరుసగా సినిమాలు షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు అని చెప్పాలి.ఈ క్రమంలోనే ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ తమ సినిమాలకు ఆసక్తిగల టైటిల్స్ పెట్టుకుని ప్రేక్షకులలో అంచనాలు పెంచేస్తున్నారు.
ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.ప్రస్తుతం అఖండ విజయం తర్వాత గోపీచంద్ మలినేని తో బాలయ్య సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాకు అన్నగారు అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నారట.అదే సమయంలో జై బాలయ్య అనే టైటిల్ కూడా పెట్టబోతున్నారని టాక్ వినిపిస్తుంది.ఇక మరోవైపు చిరంజీవి నటించిన సినిమాలకు గాడ్ ఫాదర్, బోలా శంకర అనే రెండు టైటిల్స్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.బాబి దర్శకత్వంలో రాబోయే సినిమాకి వాల్తేరు వీరయ్య అనే పవర్ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
12 ఏళ్ల తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా అనే సరికి ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి.త్రివిక్రమ్ సినిమాలకు టైటిల్స్ కాస్త డిఫరెంట్ గా ఉంటాయి.ఈ క్రమంలోనే ఈ సినిమాకు సెంటిమెంట్ కలిసొచ్చేలా అర్జునుడు అనే టైటిల్ అనుకుంటున్నారు.అటు రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకి సర్కారోడూ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.
ఇలా హీరోలందరూ తమ సినిమాల టైటిల్స్ తోనే ప్రేక్షకులలో ఆసక్తిని కలిగిస్తున్నారు.