ఈ ఒక్క రెమెడీతో మొటిమల్లేని మెరిసే చర్మాన్ని పొందొచ్చు.. తెలుసా?

పనిగట్టుకుని మరీ వచ్చి ప్రశాంతతను దూరం చేసే చర్మ సమస్య( skin problem )ల్లో మొటిమలు ముందు వరుసలో ఉంటాయి.ఒక్క చిన్న మొటిమ వచ్చిందంటే చాలు మగువలు తెగ హైరానా పడిపోతుంటారు.

 Best Home Remedy For Acne Free Skin, Acne Free Skin , Home Remedy, Latest News,-TeluguStop.com

ఎందుకంటే మొటిమలు అందాన్ని తగ్గిస్తాయి.ముఖంలో కాంతిని దూరం చేస్తాయి.

అందుకే మొటిమలు అంటేనే భయపడుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే మొటిమల్లేని మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.

Telugu Acne, Acne Skin, Aloe Vera Gel, Tips, Face, Remedy, Latest, Orangelemon,

ముందుగా ఒక ఆరెంజ్( Orange ) మరియు ఒక లెమన్ ( Lemon )తీసుకొని ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి వాటికి ఉన్న తొక్కను సపరేట్ చేసుకోవాలి.ఈ తొక్కలను బాగా ఎండపెట్టి మిక్సీ జార్ లో మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ లెమన్ పీల్ పౌడర్( Orange Lemon Peel Powder ) ను వేసుకోవాలి.

అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్ వేసుకుని స్పూన్ సహాయంతో మిక్స్ చేయాలి.

Telugu Acne, Acne Skin, Aloe Vera Gel, Tips, Face, Remedy, Latest, Orangelemon,

ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్‌, రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe vera gel ) వేసుకుని అని కలిసేంతవరకు మరోసారి మిక్స్‌ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం సున్నితంగా చర్మాన్ని రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.

రెండు రోజులకు ఒకసారి ఇలా చేస్తే మొటిమలకు దూరంగా ఉండవచ్చు.అదే స‌మ‌యంలో చర్మం కాంతివంతంగా కూడా మారుతుంది.

Telugu Acne, Acne Skin, Aloe Vera Gel, Tips, Face, Remedy, Latest, Orangelemon,

ఇక చాలామంది ముఖాన్ని తెల్లగా మార్చుకునేందుకు స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్( Skin whitening creams ) ను వాడుతుంటారు.అయితే ఈ రెమెడీ స్కిన్ వైట్నింగ్ కి చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.ఈ రెమెడీని తరచూ పాటిస్తే ఆయిలీ స్కిన్ నుంచి విముక్తి లభిస్తుంది.చర్మం పై పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్‌ తొలగిపోతాయి.చర్మం కోమలంగా, మృదువుగా మెరిసిపోతుంది.కాబట్టి మొటిమల్లేని మెరిసే అందమైన చర్మాన్ని పొందాలనుకునేవారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని పాటించేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube