కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు..ఎప్పటి నుంచంటే..

మన భారతదేశంలో ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి.ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న కొన్ని దేవాలయాలు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి.

 Kadiri Sri Lakshmi Narasimha Swamy Brahmotsavam 2023 Details, Kadiri ,sri Lakshm-TeluguStop.com

తిరుమల తిరుపతి లో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఆ తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన క్షేత్రాలలో కదిరి నరసింహస్వామి పుణ్యక్షేత్రం కూడా ఒకటి.

అనంతపురం జిల్లా కదిరిలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి ఎంతో విశిష్టత ఉంది.ప్రతి ఏడాది శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి.అలాగే ఈ సంవత్సరం కూడా లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి అధికారులు అన్నీ ఏర్పాట్లను చేస్తున్నారు.అంకురార్పణ తో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి.

పుష్పయాగోత్సవం వేడుకలతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

Telugu Anantapur, Bakti, Devotional, Kadiri, Kadirilakshmi, Kadiri Temple, Srila

ఈ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా చాలా దూర ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తారు.దేశవ్యాప్తంగా ఎన్నో చోట్ల నరసింహ స్వామి దేవాలయాలు ఉంటాయి.కానీ వాటిలో కేవలం నవ నరసింహాలయాలకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది.

నవ నరసింహాలయాల్లో అత్యంత ప్రధాన్యత కలిగిన దేవాలయం ప్రహ్లాద సమేత లక్ష్మీనరసింహస్వామి దేవాలయం.

Telugu Anantapur, Bakti, Devotional, Kadiri, Kadirilakshmi, Kadiri Temple, Srila

ఎంతో విశిష్టత కలిగిన ఆ దేవాలయంలో స్వామి వారు శ్రీ ఖాద్రి నరసింహునిగా పూజలు అందుకుంటూ ఉన్నారు.అలాగే కదిరిలో కొలువైన లక్ష్మీనరసింహస్వామి కాటమరాయుడుగా, కదిరి నరసింహుడిగా ప్రజలు పిలుస్తూ ఉంటారు.భక్తుల చేత వసంత ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహుడిగా పూజలు అందుకుంటూ ఉన్నారు.

ఇక ఈ సంవత్సరం ఇప్పటికే కదిరిలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి.

ఈ శుక్రవారం స్వామివారి కల్యాణోత్సవం వేడుక నిర్వహించనున్నట్లు దేవాలయ అధికారులు వెల్లడించారు.

స్వామివారి కల్యాణాన్ని కనులారా చూడడానికి లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది.దీంతో కదిరిలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు ఏర్పాటు చేశారు.

ఈ నెల 13న స్వామివారి బ్రహ్మరథోత్సవం వేడుకలను నిర్వహించనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube