పూజలో ఉపయోగించిన కొబ్బరికాయ కుళ్ళిపోతే.. దేనికి సంకేతమో తెలుసా..

మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు వారి ఇంట్లో దీపారాధనను ప్రతిరోజు చేస్తుంటారు.అంతే కాకుండా ప్రతిరోజు దేవాలయానికి వెళ్లి దేవుని దర్శించుకుని పూజలు కూడా చేస్తూ ఉంటారు.

 If The Coconut Used In The Pooja Rots Do You Know What It Means Details, Coconut-TeluguStop.com

ఇంట్లో పూజా కార్యక్రమం ముగిసిన తరువాత కొబ్బరికాయను కొట్టి భగవంతుడికి నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు.దర్శనం చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టడం ఎన్నో సంవత్సరాల నుంచి సంప్రదాయంగా వస్తుంది.

ఇలా కొబ్బరికాయ కొట్టడం శుభప్రదం అని వేద పండితులు చెబుతున్నారు.అయితే కొన్ని సందర్భాలలో ఇంట్లో లేదా ఆలయంలో కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోయి ఉంటుంది.

ఇలా మనం కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే చాలామంది ప్రజలు అరిష్టంగా భావిస్తారు.కుళ్ళిపోయిన కొబ్బరికాయ పూజలు ఉపయోగిస్తే జరిగే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిష శాస్త్రం ప్రకారం పూజా తర్వాత కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే అరిష్టం కాదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.కుళ్ళిన కొబ్బరికాయ కొట్టడం మనకు తెలిసి చేసిన పని కాదు కాబట్టి కొబ్బరికాయ కుళ్ళిపోవడం వల్ల ఎటువంటి చెడు జరగదని చెబుతున్నారు.

అంతేకాకుండా ఇలా కొబ్బరికాయ కుళ్ళిపోతే ఆ దోషం కుళ్ళిన కొబ్బరికాయదే కానీ ఇచ్చిన వ్యక్తిది కాదని చెబుతున్నారు.ఇంట్లో కాని ఆలయంలో కానీ కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.ఇంట్లో కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే కుళ్ళిపోయిన ఆ కొబ్బరికాయను తీసివేసి మళ్ళీ కాళ్ళు మొహం శుభ్రంగా కడుక్కొని

Telugu Bhakti, Coconut, Coconut Rots, Devotional, Pooja, Pooja Coconut, Temple-L

పూజగదిని పసుపు నీటితో శుభ్రం చేసి ఆ తర్వాత మళ్లీ పూజను ప్రారంభించడం వల్ల ఎటువంటి దోషం ఉండదని వేద పండితులు చెబుతున్నారు.ఇక దేవాలయాలలో కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే దేవుడి విగ్రహాన్ని మంచినీటితో శుభ్రం చేసి మళ్లీ మంత్రాలను చదువుతూ స్వామివారిని అలంకరించాలి.ఆ తర్వాత మళ్లీ కొబ్బరికాయ కొట్టడడం కూడా మంచిదే.అంతేకాకుండా కొత్త వాహనాలకు పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ కుళ్ళిపోతే భయపడాల్సిన అవసరం ఏమీ లేదు.ఇలా కొబ్బరికాయ కుళ్ళిపోతే దిష్టి మొత్తం తొలగిపోయిందని అర్థం చేసుకోవచ్చు.అలా వాహనం ముందు కొట్టే కొబ్బరికాయ కుళ్ళిపోతే వాహనాన్ని మంచినీళ్ళతో శుభ్రం చేసి మళ్లీ కొబ్బరికాయను కొట్టడం మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube