కాకిని హంసగా మార్చిన పుణ్య క్షేత్రమే హంసల దీవి.. చూసి తరించాల్సిందే!

పాపాలను కడిగేసే గంగమ్మ పాప విమోచనాన్ని పొందింది హంసల దీవి అని చెబుతుంటారు.కోరిన కోర్కెలు తీర్చి కొంగుబంగారంగా వేణు గోపాల స్వామి వెలసిందీ ఈ పుణ్య తీర్థానే.

 Importance Of Hamsala Deevi Details, Hamsala Deevi, Hamsala Deevi Importance, Ka-TeluguStop.com

ఇక ఇక్కడి గుడిని సాక్ష్యాత్తు దేవతలే నిర్మించారని ప్రతీతి.అదే కృష్ణా జిల్లా హంసలదీవి ప్రాంతంలో కొలువైన రుక్మిణీ సమేత వేణుగోపాల స్వామి ఆలయం.

స్థల పురాణం.హంసల దీవి దగ్గరి సాగర సంగమంలో దేవతలు పుణ్య స్నానాలు ఆచరించి ఆ చోటునే స్వామిని నెలకొల్పి ఆలయాన్ని ఒక్క రాత్రిలో నిర్మించారని స్థల పురాణం పేర్కొంటోంది.

ఆలయాన్ని దేవతలు నిర్మిస్తుండగా కోడి కూసే వేళకు ఒక మనిషి చూడటంతో దేవతలు.శిలలుగా మారిపోయారని చెబుతుంటారు.ఆలయంలో శిల్పాలుగా ఉన్న దేవతా విగ్రహాలు వారివేనని నమ్ముతారు.కొన్నేళ్ల క్రితం వరకూ అసంపూర్తిగా మిగిలిపోయిన రాజ గోపురాన్ని ఇందుకు సాక్ష్యంగా చెప్పేవారు.

విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం 1165 ప్రాంతంలో ఈ ఆలయాన్ని దత్తత తీసుకుంది.ఆలయాన్ని సర్వాంగ ద తీర్చిదిద్దింది.

ఏటా కల్యాణోత్సవాలు నిర్వహిస్తోంది.ఆలయం లోపల స్తంభాలపై రాసి ఉన్న లిపి ఏంటన్నది పురావస్తు శాస్త్రవేత్తలు తెలుసుకోలేక పోవడంతో అది దేవలిపేనని అక్కడి వారు చెబుతారు.సంతానం లేని వారు ఇక్కడి స్వామికి మొక్కుకుంటే సంతానం కలుగుతుందని నమ్మకం.అందుకే సంతాన వేణు గోపాల స్వామిగా ఈ స్వామి ప్రసిద్ధి చెందాడు.

రెండు దశాబ్దాల క్రితం వరకూ అనంతవరం భక్త సమాజమైన కుప్పావారి వంశీయులు ఈ ఆలయ నిర్వహణ చూసుకుంటూ, ఏటా స్వామివారి కల్యాణోత్సవాలను జరిపేవారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube