అయోధ్య బాలరాముడిని( Balaram of Ayodhya ) దర్శించుకోవాలని కోరుకుంటున్న భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.నెల రోజుల్లో అయోధ్య రాముడిని ఏకంగా 62 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని తెలుస్తోంది.
రోజుకు 2 లక్షల మంది అయోధ్య రాముడిని దర్శించుకోవడం గమనార్హం.రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు పరిమిత సంఖ్యలో రైళ్లు నడుస్తున్నాయి.
రైళ్ల సంఖ్య పెరిగితే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
అయోధ్య రామ మందిరానికి సంబంధించిన వింతలు, విశేషాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.
బాల రాముడిని దర్శించుకోవాలని భావించే భక్తులు దర్శనం, హారతిని ముందుగానే బుక్ చేసుకునే అవకాశం అయితే ఉంది.దర్శనం కోసం ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా సులువుగా పాస్ లను పొందవచ్చు.
బాల రామయ్యను దర్శించుకునే భక్తులు ఏదైనా గుర్తింపు కార్డ్ ను కలిగి ఉండాలి.

అయోధ్య రామునికి భక్తులు భారీ మొత్తం విరాళంగా ఇస్తున్నారని తెలుస్తోంది.అయోధ్యలోని హోటళ్లకు సైతం భారీ స్థాయిలో డిమాండ్ నెలకొంది.అయోధ్య రాముడిని దర్శించుకోవడానికి పలు ప్రముఖ ట్రావెల్స్ బస్సులను( Popular Travels Buses ) కూడా ఏర్పాటు చేస్తున్నాయి.
ఈ ఏడాది చివరి నాటికి అయోధ్యలో ఎక్కువ సంఖ్యలో హోటళ్ల నిర్మాణం జరగనుందని భారీ సంఖ్యలో హోటళ్లు అందుబాటులోకి రానున్నాయని భోగట్టా.

అయోధ్య రామయ్య ఆలయంలో ప్రసాదం కూడా ఉచితంగా అందించనున్నారని తెలుస్తోంది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూపాయి కూడా తీసుకోకుండానే ఈ ఆలయం నిర్మాణం జరిగిందని తెలుస్తోంది.అయోధ్య రామునికి విరాళాల రూపంలో ప్రతి నెలా కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది.
అయోధ్య రాముని భక్తులు ఉదయం 7 గంటల నుంచి రాముడిని దర్శించుకునే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది.అయోధ్య రామ మందిరానికి విరాళం రూపంలో వచ్చిన మొత్తాన్ని ట్రస్ట్ కార్యాలయంలో జమ చేస్తారని సమాచారం అందుతోంది.
LATEST NEWS - TELUGU