హిందువులు జరుపుకునే ప్రతి పండగకి ఒక దైవం ప్రధాన దేవతగా ఉండి పూజలను అందుకుంటుంది.ఈ నేపథ్యంలో ఉగాది( Ugadi ) రోజున ఏ భగవంతుని పూజించాలి.
అనేది చాలా మంది లో సందేహం ఉంటుంది.ఉగాది పండుగకు కాలమే దైవం కాబట్టి ఇష్ట దైవాన్ని ఆ కాలపురుషునిగా తలుచుకుని భక్తి శ్రద్దలతో పూజించాలి.
శ్రీ మహా విష్ణువు,( Sri Maha Vishnu ) శివుడు లేదా జగన్మాతను ధ్యానించినా శుభ ఫలితాలు పొందవచ్చు.ఉగాది రోజున ఏ దేవాన్ని పూజించాలి.
అలాగే ఏ వస్తువులను దానం చేయాలి అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే హిందువులు జరుపుకునే ప్రతి పండుగకి ఒక దైవం ప్రధాన దేవతగా ఉండి పూజలను అందుకుంటుంది.ఉగాది చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటారు.ఈ రోజు నుంచి సృష్టి మొదలైందని ప్రజలు నమ్ముతారు.
అందుకోసం ఉగాది రోజున తెల్లవారు జామున నిద్ర లేచి నువ్వుల నూనెతో అభ్యంగ స్నానం చేస్తారు.ఆ తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించి గడపకు పసుపు కుంకుమను అద్ది గుమ్మానికి మామిడి తోరణాలను కడతారు.

ఇంటి ముందు రంగవల్లితో తీర్చిదిద్దుతారు.ఉగాది తెలుగు వారు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలాల్లో ఒకటి అని ఖచ్చితంగా చెప్పవచ్చు.తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాది.ఈ రోజు నుంచి తెలుగు క్యాలెండర్( Telugu Calendar ) మొదలవుతుంది.ఉగాది అంటే యుగానికి మొదటి రోజు అని అర్థం.ఉగాది పండుగ వస్తుంది అంటే చాలు వేపాకు పచ్చడి, పంచాంగ శ్రవణం కోయిలల కువకువలు గుర్తుకు వస్తాయి.
ఈ రోజున చేసే ప్రతి పని ప్రభావం ఏడాది అంతా ఉంటుందని, అందుకోసం మంచి పనులు మాత్రమే చేయాలని పెద్దవారు చెబుతూ ఉంటారు.
అలాగే ఉగాది నుంచి ఎండాకాలం కూడా మొదలవుతుంది.
కాబట్టి బాటసారిలా నీరు అందించడానికి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయాలి.అలాగే కొంతమంది ఉగాది రోజు పేదవారికి చెప్పులు గొడుగు లను దానం చేస్తారు.
ఉగాది రోజు నుంచి కొత్త సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఈ రోజు కొత్త పనులను మొదలు పెట్టాలని పెద్దవారు చెబుతూ ఉంటారు.