మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంటిని శుభ్రపరిచుకోవాలంటే చీపురు ఎంతో అవసరం.అయితే చీపురును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు.
ఈ క్రమంలోనే చీపురును తొక్కకూడదనీ చీపురును ఎలా పడితే అలా ఉపయోగించకూడదని పెద్దలు చెబుతుంటారు.అదే విధంగా కొంతమంది ఎల్లప్పుడు చీపురుతో ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటారు.
అలా చేయడం ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.మరి వాస్తు శాస్త్రం ప్రకారం చీపురును ఏవిధంగా ఉపయోగించాలి? చీపురు ఎక్కడ పెట్టాలి? చీపురు ఎలాంటి సమయంలో కొనడం మంచిది అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
చీపురును సాక్షాత్తు లక్ష్మీదేవితో భావిస్తారు కనుక చీపురును ఎలా పడితే అలా ఉంచకూడదు.ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో చీపురును ఉంచకూడదని పండితులు చెబుతున్నారు.అయితే చీపురును ఎల్లప్పుడు పశ్చిమ దిశలో ఎవరికీ కనిపించకుండా ఉంచాలి.ముఖ్యంగా చీపురును ఎలాంటి పరిస్థితులలో కూడా వంటగదిలో ఉంచకూడదు.
అదేవిధంగా చాలామంది ప్రతిరోజు ఇంటిలో చీపురును తరచు ఉపయోగిస్తూ ఉంటారు.ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
అందుకోసమే సూర్యాస్తమయం అయిన తర్వాత ఎలాంటి పరిస్థితులలో కూడా చీపురును ఉపయోగించకూడదని చెబుతున్నారు.

చాలామంది చీపురు విరిగిపోయినా కూడా దానితోనే ఇల్లు శుభ్రం చేస్తుంటారు.ఇలా చేయటం వల్ల ఇంట్లో సమస్యలు మొదలవుతాయి కనుక విరిగిపోయిన చీపురుతో ఇంటిని శుభ్రం చేయకూడదు.అలాగే చీపురును ఎప్పుడు పడితే అప్పుడు కొనుగోలు చేయకుండా కేవలం కృష్ణపక్షంలో కొనుగోలు చేసి శనివారం ఉపయోగించడం వల్ల ఎంతో మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే చీపురును ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోకుండా, కాళ్లతో తన్నకుండా ఉండాలి.అదేవిధంగా చీపురతో ఎవరిని కొట్టకూడదనీ పండితులు చెబుతున్నారు.