కార్తీకమాసంలో శివుణ్ణి ఒక్కో రోజు ఒక్కో పువ్వుతో పూజిస్తే కోరుకున్న కోరికలు తీరతాయి.ఇప్పుడు శివుణ్ణి ఏ పువ్వులతో పూజించాలో వివరంగా తెలుసుకుందాం.
దూర్వారముతో శివుణ్ణి పూజిస్తే దీర్ఘాయువు కలుగుతుంది.బిల్వపత్రము, కమలము, శతపత్రము, శంఖపుష్పములతో శివుణ్ణి పూజిస్తే సంపద కలుగుతుంది.
ఉమ్మెత్త పూలతో శివుణ్ణి పూజిస్తే కొడుకు పుట్టే అవకాశాలు ఉన్నాయి.జపాకుసుమాలతో(ఎర్రగులాబీలు) లతో శివుణ్ణి పూజిస్తే శత్రు నాశనం జరుగుతుంది.
పారిజాతపుష్పములతో శివుణ్ణి పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి.మల్లెలతో శివుణ్ణి పూజిస్తే మంచి లక్షణాలు ఉన్న భార్య దొరుకుతుంది.
జాజిపూలతో శివుణ్ణి పూజిస్తే వాహన యోగం కలుగుతుంది.కరవీర(గన్నేరు) తో శివుణ్ణి పూజిస్తే రోగ నివారణ జరుగుతుంది.
అవిసె పుష్పములతో పూజిస్తే విష్ణువుకు ప్రియమైనవారు అవుతారు.
అయితే గుర్తుంచుకోవలసిన ఏమిటంటే శివునికి చంపక(సంపెంగ), మొగలి పుష్పములతో ఎట్టి పరిస్థితిలోను పూజ చేయకూడదు.