పురాణ గ్రంథాల ప్రకారం కార్తీక పూర్ణిమ ( Karthika Pournami )రోజున కొన్ని ప్రత్యేక పనులు చేస్తే లక్ష్మీదేవి( Goddess Lakshmi ) సంతోషించి మీ ఇంటికి వస్తుందని పండితులు చెబుతున్నారు.ఆ వ్యక్తి జీవితంలో డబ్బు కు కొరత ఉండదని కూడా చెబుతున్నారు.
ఈ ప్రత్యేక చర్యలలో కొన్నిటిని చేస్తే సంపద, ఆహారం ఎప్పుడు ఇంట్లోనే ఉంటాయి.జీవితంలో ఎలాంటి ఆర్థిక సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.
మరి కార్తీక పౌర్ణమి రోజున చేయాల్సిన పూజల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే కార్తీక పౌర్ణమి రోజున గంగ, యమున నదులలో స్నానం చేయడం ఎంతో మంచిదని పండితులు( Scholars ) చెబుతున్నారు.
చేతిలో కళాశాన్ని తీసుకుని పవిత్ర నదిలో స్నానం చేసి దానాలు చేయాలి.

ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుందని ప్రజలు నమ్ముతారు. కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ప్రవేశం కోసం ఇంటి ప్రధాన ద్వారం వద్దా పసుపు కలిపిన నీటితో స్వస్తిక్ చేయాలి.దీనితో పాటు మామిడి ఆకుల తోరణం కట్టాలి.
ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి( Lakshmi Devi ) వస్తుంది.కార్తీక పౌర్ణమి రోజున గంగా ఘాట్ లేదా ఏదైనా పవిత్ర నది ఘాట్ వద్ద దీపం వెలిగించడం వల్ల దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు.
దీనితో పాటు ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కూడా లభిస్తుంది.కార్తీక పౌర్ణమి రోజున తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల ప్రతి పనిలోనూ విజయం సాధించవచ్చు.

కార్తీక పౌర్ణమి రోజు పరమ శివుడిని( Lord Shiva ) కూడా పూజిస్తారు.ఈ రోజునే త్రిపురారి పూర్ణిమ అని కూడా పిలుస్తారు.ఈ రోజున శివలింగం పై గంగాజలం, తేనే, నెయ్యి, పాలు,పెరుగు గంగాజలం పంచామృతాన్ని సమర్పించడం వల్ల శివుడు సంతోషిస్తాడని పండితులు చెబుతున్నారు.నది తీరం దగ్గరలో లేకపోతే బావి దగ్గర అరటి దొప్పల్లో దీపం వెలిగించి ఒక పెద్ద పాత్రలో నీళ్లు పోసి అందులో దీపాలు వదిలాలి.
ఇంటి దగ్గర కూడా ఈశాన్య దిక్కున నీళ్లున్న పాత్రలో అరటి దొప్పల్లో దీపం వెలిగించి వదలాలి.ఆ తర్వాత ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశాల్లో కానీ,చెట్టు మొదట్లో కాని పొయ్యాలని పండితులు చెబుతున్నారు.