మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ ఫలితం తర్వాత రీమేక్ ల జోలికి వెళ్లక పోవచ్చు అని చాలా మంది అనుకుంటున్నారు.కానీ అసలు విషయం ఏంటి అంటే చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నట్లుగా మలయాళ సూపర్ హిట్ మూవీ బ్రో డాడీ కి సంబంధించిన రీమేక్ పనులు జరుగుతూనే ఉన్నాయి.
కొణిదెల సుస్మిత( Susmita ) నిర్మాణం లో సోగ్గాడే చిన్ని నాయన ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో భారీ అంచనాల నడుమ బ్రో డాడీ సినిమా రీమేక్( Bro daddy remake ) అవ్వబోతుంది అంటూ గతంలో అనధికారికంగా మేకర్స్ నుండి ప్రకటన వచ్చింది.చిరంజీవి 156వ సినిమా గా అదే రాబోతుంది.
తాజాగా యూవీ క్రియేషన్స్( UV Creations ) బ్యానర్ లో చిరంజీవి( Chiranjeevi ) కొత్త సినిమా ప్రకటించారు.దాంతో రీమేక్ విషయం లో చిరంజీవి మనసు మార్చుకుని ఉంటాడు అని అంతా భావిస్తున్నారు.కానీ అసలు విషయం ఏంటి అంటే యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో చిరంజీవి చేయబోతున్న సినిమా ను మెగా 157 గా పేర్కొంటున్నారు.అంటే మెగా 156 సినిమా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో ఉన్నట్లే కదా అన్నట్లుగా కొందరు ప్రశ్నిస్తున్నారు.
మరి ఈ విషయమై మెగా కాంపౌండ్ నుండి ఎలాంటి క్లారిటీ వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.చిరంజీవి గతంలో నెంబరింగ్ ఇచ్చిన విధంగా సినిమా లను విడుదల చేయలేదు.కనుక యూవీ క్రియేషన్స్ వారి సినిమా ముందు వచ్చి ఆ తర్వాత బ్రో డాడీ సినిమా రీమేక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మెగా స్టార్ చిరంజీవి రీమేక్ విషయం లో ఇప్పటికి అయినా జాగ్రత్త గా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.
అనవసరంగా రీమేక్ ల జోలికి వెళ్లి చేతులు కాల్చుకోవద్దని ఫ్యాన్స్ చెబుతున్నారు.ప్రస్తుతానికి అయినా రీమేక్ విషయం లో చిరంజీవి నిర్ణయాన్ని మార్చుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.