టాలీవుడ్ యంగ్‌ హీరోలు ఆ విషయంలో కళ్లు తెరిస్తే బాగుంటుంది

బాలీవుడ్( Bollywood ) తో పాటు ఇతర సినిమా ఇండస్ట్రీ లతో పోల్చితే టాలీవుడ్‌( Tollywood ) లో ఎక్కువ శాతం మంది హీరోలు ఉన్నారు అనిపిస్తుంది.ఎందుకంటే హీరో లుగా ఎంట్రీ ఇచ్చిన వారు కచ్చితంగా హీరో గా మాత్రమే నటించాలని కోరుకుంటారు.

 Tollywood Young Heroes Don't Want Do Special Roles , Tollywood , Young Heroes, S-TeluguStop.com

కనుక హీరో లు ఎక్కువ మంది ఉంటారు అన్నట్లుగా ఇండస్ట్రీ లో టాక్ ఉంది.ఒకటి రెండు సినిమాలు చేసి, ఆ సినిమా ఫ్లాప్ అయిన వారిని కూడా హీరోలుగానే ఇక్కడ పిలుస్తూ ఉంటారు.

వారు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించేందుకు ఆసక్తి చూపించరు.ఎవరో ఒకరు ఇద్దరు యంగ్ హీరోలు ఈ మధ్య కాలంలో ఇతర హీరోల సినిమా ల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టు లుగా నటించేందుకు ఓకే చెబుతున్నారు.కొందరు మాత్రం తాము ఇంకా హీరోలం అంటూ చెప్పుకుంటూ తిరుగుతున్నారు.ఈ నేపథ్యం లో కొందరు హీరోలు మాత్రం ఏదో విధంగా ఆఫర్లు దక్కించుకుంటూ ఉంటే కొందరు మాత్రం కనుమరుగు అవుతున్నారు.

హీరోగా క్రేజ్ ఉన్న సమయంలోనే మెల్ల మెల్లగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తే బాగుంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇండస్ట్రీ లో చాలా మంది యంగ్‌ హీరోల విషయం లో స్టార్‌ హీరోలు కూడా సానుకూలంగా ఉంటున్నారు.

కానీ ఆ యంగ్‌ హీరోలు మాత్రం మేము ఎందుకు ఇతర హీరోల సినిమా ల్లో నటించాలి అన్నట్లుగా పట్టుదలకు వెళ్తున్నారు./br>

ఇప్పటి వరకు కొద్ది మంది యంగ్‌ హీరోలు( Young heroes ) క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటిస్తూ మళ్లీ హీరోలుగా నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.కానీ మెజార్టీ హీరోలు మాత్రం ఇప్పటి వరకు అస్సలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు గా నటించేందుకు ఓకే చెప్పడం లేదు.వారు కళ్లు తెరిస్తే కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగే అవకాశాలు ఉంటాయి అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube