జనసేనకు అన్నీ శుభశకునాలే?

గత పది సంవత్సరాలుగా పార్టీ పెట్టి మొక్క వోని పట్టుదలతో ముందుకు వెళుతున్నప్పటికీ జనసేన( Jana sena ) అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది.రెండు చోట్లా పార్టీ అధినేత( Pawan kalyan ) ఓడిపోవడంతో పాటు గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ మారిపోవడంతో జనసేన రాజకీయంగా ప్రతిపక్ష పార్టీలనుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది.

 All Good Omens For Jana Sena, Chandrababu Naidu Arrest , Jana Sena, Pawan Kalya-TeluguStop.com

జనసేన ను విమర్శించాలనుకునే ప్రతి వ్యక్తి కూడా రెండు చోట్ల ఓడిపోయాడన్నది ప్రధాన అస్త్రం గా వాడుకునేవారు .అయితే పోగొట్టుకున్నచోటే వెతుక్కోవాలన్నట్టుగా తాను ఎక్కడైతే పోగొట్టుకున్నాడో అక్కడే బలంగా నిలబడిన జనసేనా ని ఈరోజు పార్టీని రాష్ట్ర రాజకీయ యువనిక పై బలమైన ముద్ర వేసే స్థాయికి నిలబెట్టారు.పూర్తిస్థాయిలో ప్రజల్లో అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన జనసేన రాష్ట్రం ఎదుర్కుంటున్న అనేక సమస్యల పై ముందుండి ప్రబుత్వం పై పోరాడింది .అసలైన ప్రతిపక్షపాత్రను నెరవేర్చింది.ఈరోజు తెలుగుదేశాన్ని మించిన ఇమేజ్ ను జనసేన తెచ్చుకుంది అంటే అతిశయోక్తి కాదు.

Telugu Ap, Chandrababu, Jana Sena, Pawan Kalyan, Ys Jagan-Telugu Political News

పొత్తులను ప్రకటించినప్పుడు ప్రాథమికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ జనసేనాని దిశా నిర్దేశం చేసిన తర్వాత జనసేన రాజకీయ భవిష్యత్తు పట్ల ఒక కొత్త ఉత్సాహం జనసైనికులలో కనిపిస్తుంది.ఇప్పుడు దానికి కొనసాగింపుగా కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును తిరిగి జనసేనకు కేటాయించడంతో జనసైనికులలో అంతులేని ఉత్సాహం కనిపిస్తుంది.పార్టీకి అన్నీ శుభశకునాలే కనిపిస్తున్నాయని, ఇక రాజ్యాధికారంలో తమ వాటా సాధించడమే తరువాయి అంటూ జన సైనికులు ప్రకటిస్తున్నారు.

Telugu Ap, Chandrababu, Jana Sena, Pawan Kalyan, Ys Jagan-Telugu Political News

బాబు అరస్ట్( Chandrababu Naidu Arrest ) తదితర పరిణామాల తర్వాత తెలుగుదేశం శ్రేణుల లో కొంత నైరాశ్యం అలుముకోగా జనసైనికులు మాత్రం రెట్టిన ఉత్సాహంతో కార్య క్షేత్రంలో పనిచేస్తున్నారు.వచ్చే ఎన్నికలలో జనసేన తరఫున గణనీయమైన స్థాయిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలోనూ , పార్లమెంట్లోనూ అడుగు పెడతారని జనసేన ధీమాగా ఉంది.ఈ ఉత్సాహం పార్టీని 2029లో ఏకపక్షంగా అధికారం సాధించే విధంగా నడిపిస్తుందని పార్టీ కార్యకర్తలు సానుభూతిపరులు అంచనా వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube