గ్లోబల్ వార్మింగ్ మూలాన వాతావరణం ప్రతీ ఏడాది మరింత వేడిగా మారిపోతోంది.ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి, ఎండలు మండిపోతున్నాయి.
ఈ ఎండల వలన చర్మం దెబ్బతింటోంది అని సన్ స్క్రీన్ లోషన్ ని కనిపెట్టారు మనుషులు.
సూర్యుడి వేడి నుంచి ముఖాన్ని కాపాడుకునేందుకు దీన్ని ఉపయోగిస్తారు అనే సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఆడ,మగ తేడా లేకుండా, ఎండలో బయటకి వెళుతున్నారంటే సన్ స్క్రీన్ లోషన్ రాసుకోనే బయలుదేరుతున్నారు.కాని ఈ క్రిములు మగవారు వాడకపోతేనే మంచిదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
సూర్యుడి నుంచి వచ్చే యూవి రేడియేషన్ ని మూడురకాలుగా విభజించవచ్చు.UV A, UV B, UV C.ఇందులో UV C ఒక్కటే ప్రమాదకరం కాదు.UV A వలన స్కిన్ క్యాన్సర్ మరియు ముడతలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
UV B వలన కార్నియా కి నష్టం వాటిల్లుతుంది.ఇది కూడా స్కిన్ క్యాన్సర్ ప్రమాదాన్ని మోసుకొస్తుంది.
ఈ UV రేడియేషన్ నుంచి చర్మాన్ని సంరక్షించడానికి UV ఫిల్టర్స్ ని సన్ స్రీన్ లోషన్ లో వాడతారు.ఇందులో చాలారకాల కెమికల్స్ కలపబడతాయి.
UV ఫిల్టర్స్ నుంచి చర్మంలోకి చొచ్చుకుపోతుంది ఆక్సిబెంజోన్.ఈ ఆక్సిబెంజోన్ ఈస్ట్రోజన్ లక్షణాలను కలిగి ఉంటుంది.
ఈస్ట్రోజన్ అనేది స్త్రీలలో ఉండే ముఖ్యమైన హార్మోన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు అనుకుంటా.సన్ స్రీన్ లో ఉంటే మరోరకమైన కెమికల్ మరో ఫీమెల్ హార్మోను అయిన ప్రొగెస్టీరోన్ పెరుగుదలకు కారణమవుతుంది.
ఈరకంగా మగవారిలో వీర్యకణాల ఉత్పత్తిని తగ్గిస్తుంది సన్ స్క్రీన్.
సన్ స్క్రీన్ లోషన్ లో వాడే 46% కెమికల్స్ పురుషుడి వీర్యకణాలను దెబ్బతీసేవే.
కాబట్టి మగవారు ఎండ నుంచి చర్మాన్ని కాపాడుకోవడానికి మరో మార్గాన్ని వెతుక్కుంటేనే మేలు.