వావ్, గాల్లోనే అద్భుతమైన స్టంట్ చేసిన బైకర్.. పేరెంట్స్ రియాక్షన్ ఇదే...

ఫ్రీస్టైల్ మోటోక్రాస్ స్పోర్ట్స్( Freestyle motocross sports ) చూసేందుకు రెండు కళ్ళు చాలవు.వీటికి సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి చాలామందిని ఆకట్టుకున్నాయి.

 Wow, The Biker Who Did An Amazing Stunt In Gallo This Is The Reaction Of The Par-TeluguStop.com

తాజాగా ఈ కోవకు చెందిన మరొక వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ అవుతోంది.మోటోక్రాస్ స్పోర్ట్స్‌లో వేగం కంటే రైడర్లు ఆర్టిస్టిక్, క్రియేటివ్ స్టంట్స్ పైనే దృష్టి పెడతారు.

రైడర్లు గాలిలో ఫ్లిప్ చేయడం, స్పిన్‌ తిరగడం వంటి వివిధ విన్యాసాలు చేయడం ద్వారా వారి స్కిల్స్, శైలిని ప్రదర్శిస్తారు.

అయితే వైరల్ అవుతున్న వీడియోలో బైకర్‌ ( Biker )చాలా పైకి వెళ్లాక బైక్ పై నుంచి ఎగిరి గుండ్రంగా తిరిగాడు.ఆపై మళ్లీ బైక్ పై కూర్చున్నాడు.ఈ స్పోర్ట్స్ చూసేందుకు తల్లిదండ్రులు వచ్చారు.

ఈ ఫ్లిప్ చూసి వారికి చాలా భయమేసింది.వారు చాలా భయంగా ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ పెట్టడం మనం వీడియోలో చూడవచ్చు.

ఈ స్టంట్ చేయడం మామూలు విషయం కాదు.కొంచెం తేడా వచ్చినా చాలా అడుగుల ఎత్తు పైనుంచి కింద పడే ప్రమాదం ఉంది దానివల్ల ఎముకలు విరిగిపోవచ్చు.

అందుకే పేరెంట్స్ బాగా భయపడిపోయారు.స్టంట్ పర్ఫెక్ట్ గా చేసి ల్యాండ్ అయ్యేటప్పుడు వారు ఊపిరి పీల్చుకోవడం మన వీడియోలో చూడవచ్చు.

ఆల్ థింగ్స్ ఇంట్రెస్టింగ్ అనే ట్విట్టర్ పేజీ ఈ వీడియోను షేర్ చేసింది.దీనికి ఇప్పటిదాకా ఒక కోటి 12 లక్షల దాకా వ్యూస్ వచ్చాయి.దీనిపై మీరు కూడా ఒక లుక్కేయండి.సాధారణంగా ఫ్రీస్టైల్ మోటోక్రాస్ ఈవెంట్లు ఈవెంట్ ఉద్దేశ్యాన్ని బట్టి పోటీ లేదా ప్రదర్శన కావచ్చు.పోటీ ఈవెంట్లలో రైడర్ల ట్రిక్‌ల ఎగ్జిక్యూషన్ ఆధారంగా స్కోర్స్‌ ఇస్తారు.ఎగ్జిబిషన్ ఈవెంట్‌లలో వినోద ప్రయోజనాల కోసం బైకర్స్‌ స్టంట్స్ చేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube