ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య వెనుక భారత ప్రభుత్వ హస్తం వుందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ( Justin Trudeau ) చేసిన వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య రాజుకున్న అగ్గి నేటికీ చల్లారలేదు.రెండు దేశాల మధ్య రాజీ కుదిర్చేందుకు అంతర్జాతీయ శక్తులు రహస్య యత్నాలు చేస్తూనే వున్నాయి.
భారత్ మాత్రం తమపై చేసిన నిరాధారమైన ఆరోపణలకు సాక్ష్యాలు చూపాల్సిందేనని పట్టుబడుతోంది.తాజాగా కెనడాలోని( Canada ) భారత హైకమీషనర్ సంజయ్ కుమార్ వర్మ( Sanjay Kumar Verma ) మాట్లాడుతూ.
హర్దీప్ సింగ్ హత్యపై దర్యాప్తు ముగియకుండానే న్యూఢిల్లీని ‘‘దోషి’’గా ముద్రవేశారని మండిపడ్డారు.
హత్యకు సంబంధించి కెనడా చేసిన ఆరోపణలకు మద్ధతు ఇచ్చేలా సాక్ష్యాలను విడుదల చేయాలని తేల్చిచెప్పారు వర్మ.
ఇక్కడి సీటీవీ న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న సంజయ్ కుమార్‌ను హర్దీప్ సింగ్ హత్య, ట్రూడో ఆరోపణలు, తదనంతర పరిణామాలపై ప్రశ్నించారు యాంకర్.దీనికి ఆయన స్పందిస్తూ.
విచారణ పూర్తికాకుండానే భారత్‌ను( India ) కెనడా దోషిగా తేల్చిందని, అదేనా చట్టబద్ధత అని ప్రశ్నించారు.భారత్ ఎలా దోషిగా తేలిందని అడిగితే.
ఇండియా విచారణకు సహకరించాలని చెబుతున్నారని సంజయ్ కుమార్ వర్మ ఫైర్ అయ్యారు.

ఇక.ఇటీవల యూకే పర్యటనకు వెళ్లిన భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్( Foreign Minister Dr S Jaishankar ) ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ.నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ హస్తం వుందంటూ కెనడా ఆరోపణలను తాము తోసిపుచ్చడం లేదని , అలాగే కెనడా దర్యాప్తును కూడా తాము వ్యతిరేకించడం లేదన్నారు.
తన ఆరోపణలకు మద్ధతు ఇచ్చే ఎలాంటి ఆధారాలను భారత్‌తో కెనడా పంచుకోలేదని జైశంకర్ పేర్కొన్నారు.

కెనడాలో ఖలిస్తాన్( Khalistan ) అనుకూల కార్యకలాపాలను ప్రస్తావిస్తూ వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ ఒక నిర్దిష్ట బాధ్యతతో వస్తాయన్నారు.ఆ స్వేచ్ఛలను దుర్వినియోగం చేయడం , రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగాన్ని సహించడం చాలా తప్పు అని జైశంకర్ పేర్కొన్నారు.ఈ విషయమై కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీతో( Melanie Joly ) సంప్రదింపులు జరుపుతున్నట్లు జైశంకర్ వెల్లడించారు.
కెనడాలోని భారత హైకమీషన్‌పై ఖలిస్తాన్ సానుభూతిపరుల దాడులు, దౌత్యవేత్తలపై స్మోక్ బాంబు దాడులను ఆయన గుర్తుచేసుకున్నారు.