ఇక కేబుల్ అక్కర్లేదు.. ఫోన్ నుంచి కంప్యూటర్‌లోకి ఈజీగా డేటా ఇలా పంపించుకోవచ్చు..

మన ఫోన్‌లోని డేటా కంప్యూటర్, ల్యాప్‌టాప్‌( Computer, Laptop ) లేదా ట్యాబ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలంటే అనేక యాప్ లు ఉపయోగిస్తూ ఉంటారు.అలాగే డేటా కేబుళ్లు, పెన్‌డ్రైవ్ లాంటివి ఉపయోగించి కూడా ఫోన్‌లోని డేటాను పీసీలోకి పంపించుకోవచ్చు.

 You Don't Need A Cable Anymore You Can Easily Send Data From Phone To Computer L-TeluguStop.com

అయితే ఎలాంటి కేబుల్ అవసరం లేకుండానే మొబైల్ ఫోన్‌లోని డేటాను కంప్యూటర్ లోకి పంపించుకోవచ్చు.ఒక్కొక్కసారి ఫోన్‌లో స్టోరేజ్ లేనప్పుడు, అలాగే ఏమైనా ముఖ్యమైన ఫైల్స్ ను కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో భద్రంగా ఉంచుకునేందుకు చాలామంది ఫోన్‌లోని డేటాను ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉంటారు.

Telugu Desktop, Tranfer, Transfer, Latest, Ups-Latest News - Telugu

ఎక్కువమంది కేబుల్ ( Cable )ఉపయోగించి డేటాను పంపించుకుంటూ ఉంటారు.కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది అనేక మార్గాల్లో ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకునే వెసులుబాటు వచ్చింది.కేబుల్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేసుకునే పద్దతి ఒక్కటైతే బ్లూటూత్( Bluetooth ) ద్వారా పంపించుకునే పద్దతి మరొకటి.అయితే బ్లూటూత్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే స్పీడ్ చాలా తక్కువగా ఉంటుంది.

అందుకే ఎక్కువమంది దీనిని ఉపయోగించుకోరు.బ్లూటూత్ ద్వారా ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేయాలంటే తొలుత మీ ఫోన్, పీసీలోనూ బ్లూటూత్ ఆన్ చేసుకోవాలి.

ఇందుకోసం ఆండ్రాయిడ్ ఫోన్ లో షేడ్ ని కిందకు లాగి సెట్టింగ్ ల ద్వారా బ్లూటూత్ ఆన్ చేసుకోవచ్చు.

Telugu Desktop, Tranfer, Transfer, Latest, Ups-Latest News - Telugu

ఇక విండోస్ సిస్టమ్ ( Windows system )లో స్టేటస్ బార్ లేదా కంట్రోల్ సెంటర్‌లోకి వెళ్లి బ్లూటూత్ ఆన్ చేసుకోవచ్చు.మొబైల్, మీ పీసీ బ్లూటూత్ అనుసంధానం అయిన తర్వాత ఫోన్ లో మీరు షేర్ చేయాల్సిన ఫైల్ ను ఎంచుకుని షేర్ ఐకాన్ క్లిక్ చేసి బ్లూటూత్ ఎంచుకోవాలి.ఆ తర్వాత పీసీలోని టాస్క్‌బార్‌లో బ్లూటూత్ చిహ్నంపై రైట్ క్లిక్ చేసి ఫైల్ ను స్వీకరించండి అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

ఇక గూగుల్ డ్రైవ్ ద్వారా కేబుల్ అవసరం లేకుండానే ఫైల్స్ ని షేర్ చేసుకోవచ్చు.ఇక వన్ డ్రైవ్, షేర్ డ్రాప్ వంటి యాప్స్ ద్వారా కూడా షేర్ చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube