వైరల్: బీర్ సీసాలో ప్రత్యక్షమైన ప్లాస్టిక్ స్పూన్.. ఎక్కడంటే..

ప్రస్తుతం చాలావరకు ఆన్లైన్ పార్సెల్స్ లో, ఫుడ్ ఐటమ్స్ లలో వివిధ రకాల పదార్థాలు ప్రత్యక్షమవడం మనం చూస్తూనే ఉన్నాం.అయితే తాజాగా ఒక బీరు బాటలో( Beer Bottle ) ప్లాస్టిక్ స్పూన్ దర్శనం ఇచ్చింది.

 Plastic Spoon Appears In Beer Bottle In Dhone City Viral Details, Beer, Plastic-TeluguStop.com

ఈ విచిత్రమైన సంఘటన ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా( Nandyala District ) డోన్ పట్టణంలో చోటుచేసుకుంది.అయితే తాజాగా బీర్ బాటిల్ లో ప్లాస్టిక్ స్పూన్( Plastic Spoon ) దర్శనం ఇవ్వడం అందరి ఆందోళనలకు గురిచేస్తుంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు లోకి వెళ్తే.ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా లో డోన్ పట్టణంలో( Dhone ) కింగ్ ఫిషర్ బీర్ బాటిల్లో ప్లాస్టిక్ స్పూన్స్ చూసి ఒక యువకుడు ఆశ్చర్యానికి లోనయ్యాడు.

ఆ యువకుడు డోన్ పట్టణంలోని బేతంచెర్ల సర్కిల్ వద్ద ఉన్న ఒక వైన్ షాపులో బీరుని కొనుక్కోగా బీర్ బాటిల్ తీసుకున్న యువకుడు లోపల ఏదో తెల్లగా ఉందని గమనించసాగాడు.

Telugu Andhra Pradesh, Beer, Beer Bottle, Dhone, Nandyala, Plastic Spoon, Latest

ఎంతసేపు చూసినా అది ఏమిటో అర్థం కాక అతడి సెల్ ఫోన్ లో ఉండే టార్చ్ లైట్ వేసి చూడగా చివరికి అది ప్లాస్టిక్ స్పూను అని గ్రహించాడు.ఇక వెంటనే ఆ యువకులు బీర్ కొన్న వైన్ షాప్( Wine Shop ) వద్దకు వెళ్లి ఇందులో స్పూన్ ఎలా వచ్చిందని ప్రశ్నించగా.షాప్ యాజమాన్యం మాకు ఏమీ సంబంధం లేదు అంటూ తెలిపారు.

తాము కేవలం బీరు బాటిల్స్ ను అమ్మే వారు మాత్రమే అని అన్నారు.దీంతో ఆ యువకుడు డోన్ పట్టణంలోని సబ్ ఆఫీస్ లో వెళ్లి ఫిర్యాదు చేయగా అక్కడ ఉన్న అధికారులు కూడా ఈ విషయంపై పెద్దగా స్పందన తెలపకపోవడం కాగా.

Telugu Andhra Pradesh, Beer, Beer Bottle, Dhone, Nandyala, Plastic Spoon, Latest

ఈ ఘటనకు మాకు ఎటువంటి సంబంధం లేదని మీరు నంద్యాలకు వెళ్లి ఫిర్యాదు చేసుకోవాల్సిందిగా అక్కడ అధికారులు సూచించారు.ఇక ఆ యువకుడికి ఏమి చేయాలో తెలియక అతను కొనుగోలు చేసిన మద్యం దుకాణం ముందే మ్యానుఫ్యాక్చర్ డేట్ చూపిస్తూ ఇందులో ఇప్పుడు కేవలం స్పూను మాత్రమే వచ్చింది.ఈ ప్లాస్టిక్ స్పూన్ కాకుండా వేరేది ఏదైనా వచ్చి ఉంటే మేము అనారోగ్య పాలయ్యే వాళ్ళము అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube