వైరల్: బీర్ సీసాలో ప్రత్యక్షమైన ప్లాస్టిక్ స్పూన్.. ఎక్కడంటే..

ప్రస్తుతం చాలావరకు ఆన్లైన్ పార్సెల్స్ లో, ఫుడ్ ఐటమ్స్ లలో వివిధ రకాల పదార్థాలు ప్రత్యక్షమవడం మనం చూస్తూనే ఉన్నాం.

అయితే తాజాగా ఒక బీరు బాటలో( Beer Bottle ) ప్లాస్టిక్ స్పూన్ దర్శనం ఇచ్చింది.

ఈ విచిత్రమైన సంఘటన ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా( Nandyala District ) డోన్ పట్టణంలో చోటుచేసుకుంది.

అయితే తాజాగా బీర్ బాటిల్ లో ప్లాస్టిక్ స్పూన్( Plastic Spoon ) దర్శనం ఇవ్వడం అందరి ఆందోళనలకు గురిచేస్తుంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు లోకి వెళ్తే.ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా లో డోన్ పట్టణంలో( Dhone ) కింగ్ ఫిషర్ బీర్ బాటిల్లో ప్లాస్టిక్ స్పూన్స్ చూసి ఒక యువకుడు ఆశ్చర్యానికి లోనయ్యాడు.

ఆ యువకుడు డోన్ పట్టణంలోని బేతంచెర్ల సర్కిల్ వద్ద ఉన్న ఒక వైన్ షాపులో బీరుని కొనుక్కోగా బీర్ బాటిల్ తీసుకున్న యువకుడు లోపల ఏదో తెల్లగా ఉందని గమనించసాగాడు.

"""/" / ఎంతసేపు చూసినా అది ఏమిటో అర్థం కాక అతడి సెల్ ఫోన్ లో ఉండే టార్చ్ లైట్ వేసి చూడగా చివరికి అది ప్లాస్టిక్ స్పూను అని గ్రహించాడు.

ఇక వెంటనే ఆ యువకులు బీర్ కొన్న వైన్ షాప్( Wine Shop ) వద్దకు వెళ్లి ఇందులో స్పూన్ ఎలా వచ్చిందని ప్రశ్నించగా.

షాప్ యాజమాన్యం మాకు ఏమీ సంబంధం లేదు అంటూ తెలిపారు.తాము కేవలం బీరు బాటిల్స్ ను అమ్మే వారు మాత్రమే అని అన్నారు.

దీంతో ఆ యువకుడు డోన్ పట్టణంలోని సబ్ ఆఫీస్ లో వెళ్లి ఫిర్యాదు చేయగా అక్కడ ఉన్న అధికారులు కూడా ఈ విషయంపై పెద్దగా స్పందన తెలపకపోవడం కాగా.

"""/" / ఈ ఘటనకు మాకు ఎటువంటి సంబంధం లేదని మీరు నంద్యాలకు వెళ్లి ఫిర్యాదు చేసుకోవాల్సిందిగా అక్కడ అధికారులు సూచించారు.

ఇక ఆ యువకుడికి ఏమి చేయాలో తెలియక అతను కొనుగోలు చేసిన మద్యం దుకాణం ముందే మ్యానుఫ్యాక్చర్ డేట్ చూపిస్తూ ఇందులో ఇప్పుడు కేవలం స్పూను మాత్రమే వచ్చింది.

ఈ ప్లాస్టిక్ స్పూన్ కాకుండా వేరేది ఏదైనా వచ్చి ఉంటే మేము అనారోగ్య పాలయ్యే వాళ్ళము అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

సంక్రాంతి సినిమాల ట్రైలర్ల రిలీజ్ డేట్లు ఇవే.. ఏ సినిమా ట్రైలర్ ఎప్పుడంటే?