ఈ మధ్యకాలంలో తరచుగా ఒంటరిగా వెళ్తున్న వ్యక్తులపై దాడులు జరగడం కామన్ గా మారిపోయింది.ఒక భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాలలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొని ఉంది.
రోడ్డుపై ఒంటరిగా వెళుతుంటే చాలు ఆడ, మగ తేడా లేకుండా వారిపై కొందరు దుండగులు దాడి చేసి దొరికినంత దోచుకుని వెళ్ళిపోతున్నారు.ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.
తాజాగా ఇలాంటి మరో వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో( New York ) ఓ మహిళ రోడ్డు పక్కన తన దారిన తాను నడుచుకుంటూ వెళ్తూ ఉంది.అయితే అనుకోకుండా మహిళ వెనకాల ఇద్దరు దుండగులు నల్ల మాస్కు ధరించి వెనకాల పడ్డారు.ఇలా ఒక పది అడుగులు వేస్తేనే ఆ మహిళపై( Woman ) ఒక్కసారిగా ఇద్దరు దుండగులు దాడి చేశారు.అందులో ఓ వ్యక్తి మొదటగా మహిళా తలపై వెనకాల గట్టిగా కొట్టగా ఆ తర్వాత వెంటనే మరో వ్యక్తి బేస్ బాల్ బ్యాట్తో( Baseball Bat ) ఆమె పై దాడి చేశాడు.
అలా దాడి చేయడంతో ఆ మహిళ వారి నుంచి వదులుకునేందుకు ప్రయత్నం చేయగా దాడిలో ఆమె కింద పడిపోయింది.
అయినా కానీ దుండగులు ఆమెను వదలకుండా దాడి చేశారు.ఈ సంఘటనలో ఆమెను కాలుతో కొట్టడం, అలాగే బ్యాట్ తో కొట్టడం లాంటి చర్యలు సిసిటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డు అయ్యాయి.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే ఈ దాడిలో దుండగులు ఆమె హ్యాండ్ బ్యాగ్ ను( Hand Bag ) చోరీ చేయడానికి ప్రయత్నించిన ఆవిడ మాత్రం వారికి భయపడకుండా బ్యాగును తనతోనే ఉంచుకొని పోరాటం చేసింది.దీంతో మహిళ చాలాసేపు ప్రతిఘటించడంతో ఆ మహిళను దుండగులు వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు.