వయసు పైబడిన తర్వాత ఎముకలు బలహీనంగా మారడం సర్వసాధారణ.కానీ ప్రస్తుత రోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే ఎముకల బలహీనతతో బాధపడుతున్నారు.
పోషకాహార లోపం, ఉప్పును అధికంగా తీసుకోవడం, మద్యపానం జీవన శైలిలో చోటు చేసుకున్న మార్పులు తదితర కారణాల వల్ల ఎముకలు బలహీనంగా మారుతుంటాయి.మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటే అస్సలు చింతించకండి.
ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ను మీ డైట్ లో చేర్చుకుంటే ఎముకల బలహీనత దెబ్బకు పరార్ అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఎముకలను బలంగా మార్చే ఆ జ్యూస్‌ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఎనిమిది బాదం పప్పు, ఒక కప్పు వాటర్ వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి.అలాగే మరో గిన్నెలో రెండు డ్రై అంజీర్, రెండు డ్రై ఆప్రికాట్స్ వేసుకుని వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు రెండు సపోటా పండ్లను తీసుకుని పై తొక్క లోపల ఉండే గింజలను తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న సపోటా పండు ముక్కలు, నానబెట్టి పొట్టు తొలగించిన బాదం పప్పు, డ్రై ఆప్రికాట్స్, డ్రై అంజీర్, ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా మన జ్యూస్ సిద్ధమవుతుంది.ఈ జ్యూస్ ను రెండు రోజులకు ఒకసారి తీసుకుంటే ఎముకలు బలపడడానికి అవసరమయ్యే క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, విటమిన్ కె వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
దీంతో బలహీనమైన ఎముకలు కొద్ది రోజుల్లోనే బలంగా దృఢంగా మారతాయి.ఎముకల బలహీనత సమస్యను నివారించడానికి ఈ జ్యూస్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.పైగా ఈ జ్యూస్ ను తీసుకుంటే నీరసం అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది.
హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.మరియు చర్మం నిత్యం యవ్వనంగా సైతం మెరిసిపోతుంది.