మాతృత్వం అనేది మహిళలకు ఆ దేవుడు ఇచ్చిన గొప్ప వరం అనడంలో సందేహమే లేదు.అందుకే పెళ్లి తర్వాత ప్రతి మహిళ అమ్మ అన్న పిలుపు కోసం ఎంతగానో ఆరాటపడుతుంది.
అయితే ఆ పిలుపును పొందాలంటే అనేక సవాళ్లను ఎదురుకోవాలి.ముఖ్యంగా గర్భం దాల్చిన తర్వాత రకరకాల అనుభవాలు, ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి.
అయితే కొందరికి ప్రెగ్నెన్సీ టైంలో నిద్ర సరిగ్గా పట్టదు.కంటినిండా నిద్ర లేకపోతే చాలా నీరసంగా మారిపోతుంటారు.
స్ట్రెస్ బాగా పెరుగుతుంది.పిచ్చి పిచ్చి ఆలోచనలతో తల పగిలి పోతూ ఉంటుంది.
అయితే ప్రెగ్నెన్సీ టైంలో నిద్ర పట్టకపోవడానికి మీరు చేసే కొన్ని కొన్ని తప్పులు కారణం అవుతుంటాయి.చాలామంది ప్రెగ్నెన్సీ టైంలోనూ కాఫీని వదిలి పెట్టలేకపోతుంటారు.
అయితే కాఫీ పై ఎంత ఇష్టం ఉన్నప్పటికీ గర్భం దాల్చిన తర్వాత దాన్ని ఎవైడ్ చేయడమే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే కాఫీలో అధిక మొత్తంలో ఉండే కెఫిన్ కడుపులోని శిశువు ఎదుగుదల పై ప్రభావాన్ని చూపుతుంది.
అలాగే కెఫిన్ కారణంగా ప్రెగ్నెన్సీ టైంలో నిద్ర సైతం సరిగా పట్టదు.

అలాగే ప్రెగ్నెన్సీ టైంలో కొందరు మసాలా ఫుడ్స్ ను హెవీగా లాగించేస్తుంటారు.సరిగ్గా నిద్ర పట్టకపోవడానికి ఇది ఒక కారణంగా చెప్పవచ్చు.మసాలా ఫుడ్స్ ను తీసుకోవడం వల్ల గుండెల్లో మంట, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి.
వీటి ప్రభావం నిద్ర పై పడుతుంది.కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో మసాలా ఫుడ్స్ ను తీసుకోవడం తగ్గించండి.

ఆఖరి నెలల్లో నిద్ర పట్టకపోవడానికి పెరిగిన పొట్ట కారణమవుతూ ఉంటుంది.అందువల్ల ప్రెగ్నెన్సీ పిల్లో కొనుగోలు చేసి వాడితే నిద్రకు సౌకర్యంగా ఉంటుంది.పగటి పూట గంటలు తరబడి నిద్రించినా రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పట్టదు.కాబట్టి పగటి పూట ఎక్కువ సేపు పడుకోవడం తగ్గించండి.తద్వారా రాత్రులు నాణ్యమైన నిద్ర మీ సొంతం అవుతుంది.







