కొత్త కారును కొనుగోలు చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!

తెలుగు సినిమా ప్రేక్షకులకు నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్( Prithviraj Sukumaran ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పృథ్విరాజ్ మలయాళ నటుడు అన్న విషయం మనందరికీ తెలిసిందే.

 Salaar Actor Prithviraj Sukumaran Buys New Porsche 911 Gt3 Car Know The Price De-TeluguStop.com

మొన్నటి వరకు మలయాళ ఇండస్ట్రీలో మాత్రం వినిపించిన ఈయన పేరు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా వినిపిస్తోంది.అందుకు గల కారణం ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా.

( Salaar ) ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యారు.అయితే ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు.

కాగా మలయాళీ సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒకరు.కేవలం మలయాళంలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళం, మలయాళభాషలలోనూ పృథ్వీకి మంచి పాలోయింగ్ ఉంది.ఇన్నాళ్లు హీరోగా మెప్పించిన పృథ్వీరాజ్ ఇప్పుడు విలన్ పాత్రలో మెప్పించేందుకు రెడీ అయ్యారు.తాజాగా పృథ్వీరాజ్ గ్యారేజీలోకి మరో ఖరీదైన కారు వచ్చి చేరింది.పృథ్వీరాజ్‏కు ఆటోమొబైల్స్ పై విపరీతమైన ఇష్టం ఉంది.ఇప్పటికే ఈహీరో వద్ద అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి.

ఇప్పుడు ఈ హీరో మరో కొత్త కారు కొన్నాడు.

టాలీవుడ్ టూ బాలీవుడ్ ఇండస్ట్రీలోని చాలా మంది స్టార్స్ వద్ద ఉన్న లంబోర్గినీ కారు పృథ్వీరాజ్ దగ్గర కూడా ఉందన్న సంగతి తెలిసిందే.తాజాగా పృథ్వీరాజ్ 911GT3 పోర్షే కారును( Porsche 911 GT3 ) తీసుకున్నాడు.పోర్స్చే 911 GT3 అనేది పోర్స్చే వాహనం స్పోర్ట్స్ కార్లలో అధిక పనితీరు గల హోమోలోగేషన్ మోడల్.ఈ లగ్జరీ వాహనం ధర దాదాపు రూ.3 కోట్లు ఉంటుందని సమాచారం.ఈ కారు 375kW పనితీరును కలిగి ఉంటుంది.అలాగే ఈ కారు పనితీరు 6-స్పీడ్ GT స్పోర్ట్స్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube