జనసేన గెలుపుతో చిరంజీవి పాలిటిక్స్ లో రీఎంట్రీ.. వైరల్ వార్తల్లో నిజాలు ఇవే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన( Janasena ) 100% స్ట్రైక్ రేట్ తో సత్తా చాటిన సంగతి తెలిసిందే.21 స్థానాల్లో పోటీ చేయగా 21 స్థానాల్లో జనసేనకు అనుకూల ఫలితాలు దక్కాయి.జనసేన గెలుపుతో చిరంజీవి( Chiranjeevi ) రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారని కొన్ని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు.

 Rumours Goes Viral About Chiranjeevi Political Reentry Details, Chiranjeevi, Paw-TeluguStop.com

చిరంజీవి ప్రస్తుతం సినిమాలకే కెరీర్ ను అంకితం చేశారు.

రాజకీయాలు( Politics ) తనకు సూట్ కావని గతంలో సినిమాలకు గుడ్ బై చెప్పిన చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన నేపథ్యంలో సినిమాలకే పూర్తి సమయాన్ని కేటాయించనున్నారని తెలుస్తోంది.

జనసేన విజయం సాధించినా ఆ విజయం పవన్( Pawan Kalyan ) విజయంగా చిరంజీవి భావిస్తున్నారని భోగట్టా.రాజకీయాల్లోకి వెళ్తే ఎన్నో విమర్శలను ఎదుర్కోవడంతో పాటు నెగిటివ్ కామెంట్లకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

Telugu Ap, Chiranjeevi, Janasena, Pawan Kalyan, Vishwambara-Movie

చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో( Vishwambhara Movie ) నటిస్తుండగా ఈ సినిమా బడ్జెట్ పరంగా ఎక్కువ బడ్జెట్ తోనే తెరక్కెకుతోంది.దాదాపుగా 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.చిరంజీవి, త్రిష చాలా సంవత్సరాల తర్వాత కలిసి నటిస్తుండటం ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి మరో కారణమని చెప్పవచ్చు.మల్లిడి వశిష్ట తన సినిమాను సంక్రాంతి రేసులో నిలిపారు.

Telugu Ap, Chiranjeevi, Janasena, Pawan Kalyan, Vishwambara-Movie

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తైందని తెలుస్తోంది.విశ్వంభర సినిమా నుంచి చిరంజీవి పుట్టినరోజు కానుకగా అదిరిపోయే అప్ డేట్స్ అయితే రానున్నాయి.చిరంజీవి హరీష్ శంకర్ కాంబోలో ఒక సినిమా ఫిక్స్ అయిందని ఆ సినిమాకు సంబంధించి త్వరలో అప్ డేట్స్ వస్తాయని తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ కావడంతో ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube