జనసేన గెలుపుతో చిరంజీవి పాలిటిక్స్ లో రీఎంట్రీ.. వైరల్ వార్తల్లో నిజాలు ఇవే!
TeluguStop.com
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన( Janasena ) 100% స్ట్రైక్ రేట్ తో సత్తా చాటిన సంగతి తెలిసిందే.
21 స్థానాల్లో పోటీ చేయగా 21 స్థానాల్లో జనసేనకు అనుకూల ఫలితాలు దక్కాయి.
జనసేన గెలుపుతో చిరంజీవి( Chiranjeevi ) రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారని కొన్ని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు.
చిరంజీవి ప్రస్తుతం సినిమాలకే కెరీర్ ను అంకితం చేశారు.రాజకీయాలు( Politics ) తనకు సూట్ కావని గతంలో సినిమాలకు గుడ్ బై చెప్పిన చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన నేపథ్యంలో సినిమాలకే పూర్తి సమయాన్ని కేటాయించనున్నారని తెలుస్తోంది.
జనసేన విజయం సాధించినా ఆ విజయం పవన్( Pawan Kalyan ) విజయంగా చిరంజీవి భావిస్తున్నారని భోగట్టా.
రాజకీయాల్లోకి వెళ్తే ఎన్నో విమర్శలను ఎదుర్కోవడంతో పాటు నెగిటివ్ కామెంట్లకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
"""/" /
చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో( Vishwambhara Movie ) నటిస్తుండగా ఈ సినిమా బడ్జెట్ పరంగా ఎక్కువ బడ్జెట్ తోనే తెరక్కెకుతోంది.
దాదాపుగా 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.
చిరంజీవి, త్రిష చాలా సంవత్సరాల తర్వాత కలిసి నటిస్తుండటం ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి మరో కారణమని చెప్పవచ్చు.
మల్లిడి వశిష్ట తన సినిమాను సంక్రాంతి రేసులో నిలిపారు. """/" /
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తైందని తెలుస్తోంది.
విశ్వంభర సినిమా నుంచి చిరంజీవి పుట్టినరోజు కానుకగా అదిరిపోయే అప్ డేట్స్ అయితే రానున్నాయి.
చిరంజీవి హరీష్ శంకర్ కాంబోలో ఒక సినిమా ఫిక్స్ అయిందని ఆ సినిమాకు సంబంధించి త్వరలో అప్ డేట్స్ వస్తాయని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ కావడంతో ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమాచారం అందుతోంది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్2, సోమవారం 2024