అశ్విని దత్( Ashwini Dutt ) తెలుగు సినిమా చరిత్రలోనే ఒక గొప్ప నిర్మాతగా చాలా మంచి సినిమాలు తీశారు.అయితే ఆయన తీసిన శక్తి సినిమా( Shakti ) దాదాపు అశ్విని దత్ సినిమా ఇండస్ట్రీ నుంచి పక్కకు వెళ్లిపోయేలా చేసింది.
అయితే ఆయన పక్కకు వెళ్లిపోయిన కూడా వారసులు లేరు అనే బాధను మరిచిపోయేలా అశ్విని దత్ కుమార్తెలు స్వప్న దత్( Swapna Dutt ) మరియు ప్రియాంక దత్( Priyanka Dutt ) తమ నిర్మాణ సంస్థ అయిన వైజయంతి మూవీస్( Vyjayanthi Movies ) ని ప్రస్తుతం టాలీవుడ్ లోనే టాప్ ప్రొడక్షన్ హౌస్ గా నిలబెట్టారు.చాలామంది ఈ పెద్ద దర్శకులు పెద్ద నిర్మాతలు కూడా తమ వారసులు సరిగ్గా చేయకపోవడంతో ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోతున్న ఈ తరుణంలో ఆడపిల్లలు అయినా సరే ఎక్కడ వెనక్కి తగ్గకుండా వైజయంతి మూవీ ప్రఖ్యాతలను రోజు రోజుకి పెంచుకుంటూ వెళుతున్నారు.
డబ్బులు ఉన్నాయి కాబట్టి కూతుర్లను నిర్మాతలను చేయడం పెద్ద పని కాదు అశ్విని దత్ కి.కానీ స్వప్న మరియు ప్రియాంక ఇద్దరు మంచి టాలెంటెడ్ ఫిలిం మేకర్స్.యువత ఇలా టాలెంట్ తో కనుక సినిమాను తీస్తే ఎలా ఉంటుందో మహానటి సినిమాను చూస్తే అర్థం చేసుకోవచ్చు.మనం చాలాసార్లు రాజమౌళి అద్భుతంగా ప్రమోషన్స్ చేస్తాడు అని అనుకుంటాము కానీ వైజయంతి మూవీస్ వారు చేసే ప్రతి సినిమా కూడా అంతే అద్భుతంగా వస్తుంది.
ఈ ఇద్దరు తండ్రి పేరు నిలబెట్టడం మాత్రమే కాదు తమ భవిష్యత్తులో మంచి డైరెక్టర్ కూడా ఉంటే ప్రొడక్షన్ హౌస్ వాల్యూస్ పెరుగుతాయి అనే ఉద్దేశంతో నాగ్ అశ్విన్ నీ( Nag Ashwin ) ఇండస్ట్రీలోనే మంచి డైరెక్టర్ గా ఎదిగేందుకు సహాయం చేస్తున్నారు.
ఇంట్లోనే మంచి దర్శకుడు ఉన్నాడు ప్రపంచం మీరు చేసే సినిమా తీస్తున్నాడు అలాగే వారే నిర్మాతగా సినిమాలు చేసుకోగలరు అందుకే వీరికి నిర్మాతలతో పనిలేదు దర్శకులతో అంతకన్నా పడలేదు ఒకే కుటుంబంలో అందరూ ఉన్నారు.ఇక కావాల్సింది ఒకరితో ఒకరికి మంచి అండర్స్టాండింగ్ అది ఎప్పుడు ఉంటుంది అందుకే వైజయంతి మూవీస్ దినదినాభివృద్ధి చెందుతూనే ఉంటుంది.ఇక కల్కి సినిమాతో( Kalki Movie ) మరోమారు వీరి ప్రభంజనం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.
కొడుకులు ఉన్నారు ఏదో పొడి చేస్తారు అనుకున్న వారికి మెడలు వంచి మరి సలాం కొట్టే పరిస్థితులు కూతుల్లు కూడా చేస్తున్నారు.