కథ నచ్చి రానా నిర్మించిన 'C/O కంచరపాలెం' హిట్టా.? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!!

Movie Title; C/O కంచరపాలెం

 Co Kancharapalem Movie Review-TeluguStop.com

Cast & Crew:

న‌టీన‌టులు:సుబ్బారావు,రాధ బెస్సీ,కేశవ కర్రీ,నిత్య శ్రీ,కార్తీక్‌ రత్నం,విజయ ప్రవీణ,మోహన్‌ భగత్‌,ప్రణీత పట్నాయక్‌ త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం: వెంకటేష్ మహా
నిర్మాత‌:ప్రణీత పరుచూరి, రానా దగ్గుబాటి
సంగీతం: స్వీకర్ అగస్తి

STORY:

కంచరపాలెం అనే ఊరిలో నాలుగు భిన్న వయస్సుల ప్రేమజంటల కథే ‘C/O కంచరపాలెం’.రాజు (సుబ్బారావు) గవర్నమెంట్ ఆఫీస్‌లో అటెండర్.49 ఏళ్లు వచ్చినా.పెళ్లి చేసుకోకుండా ఒంటిరిగానే ఉండిపోతాడు.

అదే ఆఫీస్‌కి అధికారిగా ఒడిశా నుండి బదిలీ మీద వస్తుంది రాధ (రాధ బెస్సీ).భర్త చనిపోయిన ఆమెకు 20 ఏళ్ల కూతురు ఉంటుంది.

యాభై ఏళ్లు దగ్గర పడుతున్నా రాజుకి పెళ్లి కాకపోవడంతో ఊర్లో అందరూ ఆయన గురించే మాట్లాడుతుంటారు.అదే టైమ్‌లో రాజు ప్రవర్తన నచ్చి అతని ప్రేమలో పడుతుంది రాధ.

రెండో జంట.జోసెఫ్ (కార్తీక్ రత్నం), భార్గవి (ప్రణీతా పట్నాయక్).జోసెఫ్ క్రిస్టియన్ టీనేజ్ కుర్రాడు.కంచరపాలెంలో అమ్మోరు జిమ్ ఓనర్‌ దగ్గర పనిచేస్తూ.సెటిల్ మెంట్‌ల పేరుతో గొడవలకు వెళ్తుంటాడు.అనుకోకుండా బ్రాహ్మణుల అమ్మాయి భార్గవితో గొడవపడి.

ఆ తరువాత ఇద్దరూ ప్రేమలో పడతారు.

మూడో జంట.గెడ్డం (మోహన్ భగత్), సలీమా(విజయ ప్రవీణ).అనాధ అయిన గెడ్డం కంచరపాలెం వైన్ షాప్‌లో బాయ్‌గా పనిచేస్తుంటాడు.

అదే షాప్‌కి ప్రతి రోజు వచ్చి మందు కొంటుంది సలీమా అనే వేశ్య.ఆమె ముఖానికి ముసుగు కట్టుకోవడంతో కళ్లు చూసి ప్రేమిస్తాడు గెడ్డం.

నాలుగో జంట.సుందరం (కేశవ కర్రి), సునీత (నిత్య శ్రీ).వీళ్లది చిన్ననాటి ప్రేమకథ.ఇద్దరూ ఒకే స్కూల్‌లో చదువుకుంటూ ఉంటారు.సుందరానికి సునీత అంటే చాలా ఇష్టం.ఆమెతో మాట్లాడాలని తనతో ఉండాలని ప్రయత్నిస్తాడు.

సునీత ఇష్టాలనే తన ఇష్టాలుగా మార్చుకుని ఆమె కోసం పరితపిస్తాడు.

ఇలా కంచరపాలెంలో మొదలైన సున్నిత ప్రేమకథలు కులం, మతం, ప్రాంతం, వయసు, అంతస్తుల ప్రభావంతో ఎలాంటి మలుపులు తిరిగాయి.

తమ ప్రేమలను గెలిపించుకున్నారా? ఈ నాలుగు ప్రేమ జంటలకు ఒకరితో ఒకరికి సంబంధం ఏమిటి? కుల, మత సంకెళ్లను ఈ ప్రేమ జంటలు జయించాయా లేదా అన్నదే ‘C/O కంచరపాలెం’ కథ.

REVIEW:

ఓ గ్రామంలోని వ్యక్తులు వారి జీవితాలే కథా వస్తువుగా తీసుకున్న దర్శకుడు వెంకటేష్‌ మహా.ఎక్కడా సినిమాటిక్‌గా చూపించే ప్రయత్నం చేయలేదు.సినిమాను పూర్తిగా సహజంగా తెరకెక్కించేందుకు ప్రయత్నించాడు.

మర్షియల్‌ లెక్కల కోసం హాస్య సన్నివేశాలను ఇరికించకుండా.లీడ్‌ క్యారెక్టర్స్‌ ప్రవర్తన నుంచే కామెడీ పండించి ఆకట్టుకున్నాడు.

ఫస్ట్ హాఫ్లో పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్న దర్శకుడు నెమ్మదిగా కథ నడిపించాడు.నాలుగు కథలను ప్యారలల్‌గా నడిపించిన దర్శకుడు క్లైమాక్స్‌ ట్విస్ట్‌తో ఆడియన్స్‌కు షాక్‌ ఇచ్చాడు.

లైవ్‌ రికార్డింగ్‌ అయినా ఎక్కడ ఆడియో డిస్ట్రబెన్స్‌ లేకుండా క్వాలిటీ సౌండ్‌ను అందించారు.సినిమాకు మరో ఎసెట్‌ వరుణ్‌, ఆదిత్యల సినిమాటోగ్రఫి.కంచరపాలెం వాతావరణాన్ని వ‍్యక్తిత్వాలను అందంగా ఫ్రేముల్లో బందించారు.స్వీకర్‌ అగస్థి సంగీతం సినిమా స్థాయిని పెంచింది.

ఇక నటీనటుల విషయానికి వస్తే దాదాపు 52 మంది కొత్త తారలు ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు.మేకప్‌, కలర్‌ ఫుల్‌ కాస్ట్యూమ్స్‌ లాంటివి లేకుండా తెర మీద సహజంగా కనిపించారు.

అయితే అంతా కొత్త వారు కావటంతో అక్కడక్కడ వారి నటనలో కాస్త నాటకీయత కనిపించినా.ఒకసారి కథలో లీనమైతే అవేవి పెద్దగా ఇబ్బంది పెట్టవు.

Plus points:

స్టోరీ
కామెడీ
మ్యూజిక్
సినిమాటోగ్రఫీ
క్లైమాక్స్ ట్విస్ట్
డైరెక్షన్

Minus points:

ఫస్ట్ హాఫ్
నటీనటులకు కొత్త సినిమా అవ్వడంతో వారి నటనలో కాస్త నాటకీయత కనిపించింది

Final Verdict:

కేరాఫ్‌ కంచరపాలెం … ఆడియన్స్ కు నచ్చడం కాయం

Rating: 3 / 5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube