టైటిల్ చూడగానే ఛీ ఛీ ఇదేమి విట్టురం అనుకుంటున్నారా.? ఈ సంఘటన నిజంగానే జరిగింది.కానీ అలా జరగడం వెనక పెద్ద మిస్టరీనే ఉంది.అదేంటో చూడండి.! అమెరికాలోని మిసిసిప్పీలో ఇది జరిగింది.అయితే ఈ విషయం డీఎన్ఏ టెస్ట్ జరిగే వరకు వారికి తెలియదు.
వారిద్దరు కవలలు.ఒకరు ఆడ.మరొకరు మగ.వారి తల్లి తండ్రులు మరణించారు… వారిద్దరిని.రెండు వేరు వేరు కుటుంబాలు దత్తత తీసుకున్నాయి.ఆ తర్వాత ఒకరి గురించి మరొకరికి తెలియదు.కానీ కొన్ని సంవత్సరాల తరవాత.!

అనుకోకుండా వారు ఇద్దరూ ఒకే కాలేజీలో చేరారు.ఒకరోజు ఒకరిని ఒకరు చూసుకుని నమ్మలేకపోయారు.ఇద్దరి మధ్య పొలికలు ఉండడంతో స్నేహం చిగురించింది.
స్నేహం కాస్తా ప్రేమగా మారింది.దీంతో పెళ్లి కూడా చేసుకున్నారు.
అంతాబాగానే ఉంది.ఈ క్రమంలో టెస్ట్ ట్యూబ్ బేబీ కొరకు వైద్య పరీక్షలు చేయించుకొనటానికి వారిద్దరూ హాస్పిటల్ కు వెళ్లారు.

అక్కడ ఇద్దరికీ డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించిన వైద్యులు షాక్‌కు గురిచేసే విషయాన్ని చెప్పారు.భార్యాభర్తలిద్దరూ కవల పిల్లలని, తోబుట్టువులని నిర్థారించారు.దీంతో ఆ జంటతోపాటు అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు.భార్యభర్తల పేర్లను వైద్యులు వెల్లడించలేదు.కానీ విషయాన్ని మీడియాకు తెలిపారు.స్థానిక చట్టాల ప్రకారం తోబుట్టువులు పెళ్లి చేసుకుంటే 10 ఏళ్ల జైలుశిక్షతోపాటు 32 వేల రూపాయల జరిమానా విధించాల్సి ఉంది.
కానీ వారిద్దరూ తోపుట్టువులని వారికి తెలియకుండా పెళ్లి చేసుకున్నారు.కావున వీరిద్దరిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు.







