పెరుగులో ఇవి కలిపి రాస్తే వద్దన్నా మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.. తెలుసా?

జుట్టు ఒత్తుగా పెరగాలని ఆడవారే కాదు మగవారు కూడా కోరుకుంటారు.ఒత్తైన కురుల కోసం రకరకాల హెయిర్ ప్యాక్ లు వేసుకుంటూ ఉంటారు.

 Adding These To Yogurt Will Make Your Hair Grow Thicker Details, Yogurt, Curd Ha-TeluguStop.com

ఖరీదైన హెయిర్ ఆయిల్స్ వాడుతుంటారు.అయితే జుట్టును ఒత్తుగా( Thick Hair ) పెంచడానికి మన వంటింట్లో ఉండే పెరుగు( Curd ) చాలా అద్భుతంగా తోడ్పడుతుంది.

పెరుగు ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టు సంరక్షణకు సైతం మద్దతు ఇస్తుంది.ముఖ్యంగా పెరుగులో ఇప్పుడు చెప్పబోయే పదార్థాలు కలిపి రాస్తే వద్దన్నా కూడా మీ జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.

అందుకోసం ముందుగా ఒక ఉల్లిపాయను( Onion ) తీసుకుని తొక్క తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్లు గడ్డ పరుగు వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఆవనూనె,( Mustard Oil ) వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloevera Gel ) మరియు పావు కప్పు ఉల్లిపాయ జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Curd Benefits, Curd, Care, Care Tips, Healthy, Thick, Yogurt-Telugu Healt

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ పెరుగు మాస్క్ వేసుకోవడం వల్ల బోలెడు లాభాలు పొందుతారు.పెరుగు సహజమైన కండీషనర్ గా ప‌ని చేస్తుంది.ఇది మీ జుట్టును మృదువుగా మరియు మెరిసేలా చేస్తుంది.

Telugu Curd Benefits, Curd, Care, Care Tips, Healthy, Thick, Yogurt-Telugu Healt

పెరుగులో ప్రోటీన్ ఉంటుంది.ఇది హెయిర్ ఫోలికల్స్‌ను బలపరుస్తుంది.జుట్టు రాలడాన్ని నిరోధించడంలో తోడ్ప‌డుతుంది.

కురులు ఒత్తుగా పెరిగేందుకు మ‌ద్ద‌తు ఇస్తుంది.పెరుగులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చుండ్రు మరియు ఇతర స్కాల్ప్ ఇన్ఫెక్షన్‌లను నివారిస్తాయి.

ఆవ‌నూనె, ఉల్లిపాయ జ్యూస్‌, అలోవెర జెల్ ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే పోషకాలను కలిగి ఉంటాయి.హెయిర్ డ్యామేజ్ ను అరిక‌డ‌తాయి.

మ‌రియు జుట్టును హైడ్రేట్ చేస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube