సినిమా తారలను పోలిన సోషల్ మీడియా సెలబ్రిటీలు ఎవరో తెలుసా?

ఈ భూమ్మీద మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మనం చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాం.అది వాస్తవమే అని ఎప్పటికప్పుడు రుజువు అవుతూనే ఉంది.

 Social Media Celebrities Doops As Celebs , Allu Arjun, Maliwood‌, Kunchako Bob-TeluguStop.com

తాజాగా పలువురు సినిమా, రాజకీయ, స్పోర్ట్స్ సెలబ్రిటీల మాదిరిగా ఉన్న చాలా మంది ఈ మధ్య దర్శనం ఇస్తున్నారు.జనాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు.

సినిమా రంగానికి చెందిన వారి విషయానికి వస్తే.కొందరు డూప్స్ అచ్చం హీరోల్లాగే గెటప్ వేసుకుని రిస్కీ షాట్లు చేస్తుంటారు.

మరికొందరు ఆయా సినిమా తారల్లాగ తయారై కామెడీ షోలు చేస్తుంటారు.కానీ తాజాగా సినిమా స్టార్స్ ఎలా ఉన్నారో.

వారిలాగే కొందరు కనిపిస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.వారిని చూసి నిజమైన తారలు కూడా సర్ప్రైజ్ అవుతున్నారు.

Telugu Alina Rani, Allu Arjun, Kiara Advani, Kunchako Boban, Maliwood, Sarah Ali

తాజాగా అల్లు అర్జున్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఓ వీడియో షేర్ చేశాడు.అందులో తన మాదిరిగానే ఉన్న ఓ వ్యక్తి కనిపిస్తున్నాడు.అచ్చం బన్నీలాగే ఉండి.ఆయనలాగే ఎక్స్ ప్రెషన్స్ ఇస్తున్నాడు.ఇంతకీ తను ఎవరో కాదు.మాలీవుడ్‌లో పలు సినిమాలు చేసిన నటుడు కుంచాకో బోబన్.

ఈయన వీడియోను అల్లు అర్జున్ షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ప్రభాస్ మాదిరిగా ఉన్న మరో వ్యక్తి కూడా బాహుబలి రిలీజ్ సమయంలో బాగా ఫేమస్ అయ్యాడు.

అటు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని లాగే ఉండే మరో అమ్మాయి ఫోటోలు వైరల్ అయ్యాయి.దీంతో తనకు సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ పెరిగింది.

ఈ అమ్మాయి పేరు ఐశ్వర్యగా గుర్తించారు.తను డాక్టర్.

అటు బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనేలా కనిపించే అమ్మాయి బాలీవుడ్ లోనే ఉండటం విశేషం.ఆమె మరెవరో కాదు.

సునీత.ప్రముఖ డ్యాన్సర్.

అటు కత్రీనాను పోలిన అమ్మాయి కూడా ఉంది.ఆమె పేరు అలీనా రాణి.

ఆమె ముఖం, జుట్టు.అంతా కత్రీనా జీరాక్స్ లాగే ఉంటుంది.

Telugu Alina Rani, Allu Arjun, Kiara Advani, Kunchako Boban, Maliwood, Sarah Ali

మరోవైపు బాలీవుడ్ క్యూట్ స్టార్ సారా అలీఖాన్ లాగే మరో అమ్మాయి కనిపించింది.ఆమె పేరు సాక్షి.తను కూడా సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయ్యింది.అటు ప్రియాంకా చోప్రాలాగే ఉన్న అమర్య డోంగ్రే కూడా ప్రస్తుతం మంచి పాపులారిటీ సంపాదించిదిం.కాజోల్ లా కనిపించే నేహా.అనుష్క శర్మలా ఉండే జూలియా మైఖేల్ ప్రస్తుతం సోషల్ మీడియా సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు.

అటు సమంతాలా కనిపించే అషూరెడ్డి కూడా ప్రస్తుతం పలు షోలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube