కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం( Pithapuram Constituence )లో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.ఈ క్రమంలో నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పిఠాపురం నియోజకవర్గ అభ్యర్థిగా పవన్ కల్యాణ్( Pawan Kalyan ) పోటీ చేయకపోతే కచ్చితంగా తానే బరిలో ఉంటానని తెలిపారు.పవన్ కల్యాణ్ మనసు మార్చుకొని ఎంపీగా వెళ్తే పిఠాపురం అసెంబ్లీ సీటు తనదేనని స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తే భారీ మెజార్టీతో గెలిపిస్తామని వర్మ( SVSN Varma ) తెలిపారు.మోదీ, అమిత్ షా ఆదేశిస్తే కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని పవన్ చెప్పిన సంగతి తెలిసిందే.
పిఠాపురం, కాకినాడ సీట్లు స్వాప్ చేసుకుంటామని తెలిపారు.