దర్శక ధీరుడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న రాజమౌళి( Rajamouli ) ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.ఇండియాలో ఈయనని మించిన దర్శకుడు మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతి శయోక్తి లేదు.
అలాంటి రాజమౌళి చేసే ప్రతి సినిమాకి వాళ్ళ నాన్న అయిన విజయేంద్రప్రసాద్ కథని అందిస్తాడు.ఇలాంటి సమయంలో సినిమా షూటింగ్ కి వెళ్లే ముందు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు రాజమౌళికి వాళ్ళ నాన్నకి తరచుగా గొడవలు జరుగుతూనే ఉంటాయట.
ఎందుకంటే ఒక సీన్ విజయేంద్ర ప్రసాద్( Vijayendra Prasad ) రాసినప్పుడు సినిమా స్టోరీ ని డామినేట్ చేసే విధంగా కొన్ని సీన్స్ ఉంటాయట.దాన్ని రాజమౌళి కంట్రోల్ చేసే విధానంలో ఇద్దరు మధ్య వాగ్వివాదాలు వాస్తు ఉంటాయి.ఇలా వీళ్లిద్దరూ గొడవలు పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయట.అయినప్పటికీ వాళ్ళు పర్సనల్ గా గొడవలు పెట్టుకోరు, సినిమాల పరంగా మాత్రమే గొడవలు జరుగుతూ ఉంటాయి.ఇక ఫైనల్ గా రాజమౌళి తనకు కన్ క్లుజన్ అనేది ఇచ్చి అది ఎందుకు కరెక్టు అది ఎందుకు సినిమాలో ఉండాలి ఇది ఎందుకు ఉండకూడదనేది ఎక్స్ ప్లెయిన్ చేయడంతో విజయేంద్ర ప్రసాద్ కాంప్రమైజ్ అవుతారట.కొన్నిసార్లు విజయేంద్రప్రసాద్ రాజమౌళిని కూడా కాంప్రమైజ్ చేయగలుగుతారట.
అలా ఇద్దరి మధ్య మంచి కోఆర్డినేషన్( Coordination ) అనేది ఉంటుంది.కాబట్టే వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న చాలా సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకుంటున్నాయి… ఇక మొత్తానికైతే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్( Star Director ) ప్రస్తుతం ఇండియాలో మరొకరు లేరు అనేది మాత్రం వాస్తవం…ఇక ఇప్పుడు ఈయన పాన్ వరల్డ్ లో సినిమాలు చేస్తున్నాడు కాబట్టి ఇక మీదట అక్కడ కూడా తెలుగు సినిమా స్థాయిని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు…
.