ప్రస్తుతం మన భారతదేశంలో పెళ్లిల సీజన్ ఉంది.దాదాపు ఈ పెళ్లిల సీజన్లో ఏకంగా కొన్ని లక్షల వివాహాలు జరగబోతున్నట్లు సమాచారం.
అంతేకాకుండా ఈ సీజన్లో పెళ్లిళ్ల కోసం ఏకంగా ఐదు లక్షల కోట్ల ఖర్చు అవుతున్నట్లు ట్రేడ్ వర్గాల అంచనాలు కూడా ఉన్నాయి.నిత్యం వివాహాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.
వైరల్ అవుతున్న వీడియోలలో( Viral Video ) కొన్ని వీడియోలు నెటిజన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటే.మరికొందరికి ఆశ్చర్యానికి కలుగ చేస్తూ ఉంటాయి.
అచ్చం అలాంటి వీడియోని ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.వధూవరులు( Bride Groom ) చేసిన పనిని చూసి ఒక్కసారిగా అందరూ షాకుకి గురవుతున్నారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా.ఒక వివాహ వేడుక( Wedding ) కార్యక్రమంలో వేదికపై వధూవరులు ఇద్దరు దండలు మార్చుకున్నారు.అనంతరం జయ మాల కార్యక్రమం ముగిసిన అనంతరం వధూవరులు మధ్య ఏదో చిన్నపాటి వివాదం జరిగింది.
ఆ చిన్న ఫైటింగ్ కాస్త ముదిరిపోయి ఇద్దరు ఒకరు బాగా కొట్టుకున్నారు.
ఈ క్రమంలో అక్కడ ఉన్నవారు అందరూ వారి ఇద్దరినీ ఆపేందుకు ప్రయత్నం చేసినా కానీ.వారు ఎవరిని పట్టించుకోకుండా అలానే కొట్టుకున్నారు.ఈ సంఘటన మొత్తం చూసిన బంధువులు, స్నేహితులు పెళ్లికి హాజరైన అతిధులు అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.
ఇక ఈ వైరల్ వీడియోను చూసిన కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.పెళ్లిరోజె ఇలా ఉంటే.ఆ తర్వాత ఎలా ఉంటుందో మరి అని కామెంట్ చేస్తూ ఉన్నారు.మరి కొందరు ఫన్నీ ఈమొజిలతో కామెంట్స్ చేస్తున్నారు.