ఖర్జూరం గింజలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా.. మధుమేహులకు ఇవి వరమే!

ఖర్జూరం( Dates ).మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారాల్లో ఒకటి.

 How To Consume Date Seeds For Good Health! Date Seeds, Date Seeds Benefits,  Bad-TeluguStop.com

అయితే చాలామంది ఖర్జూరం తిని.వాటిలోని గింజలు బయట పారేస్తుంటారు.

నిజానికి ఖర్జూరమే కాదు ఖర్జూరం గింజలు కూడా మన ఆరోగ్యానికి అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.ఖర్జూరం గింజల్లోనూ ఎన్నో రకాల మినరల్స్, ఫైబర్ తదితర పోషకాలు మెండుగా ఉంటాయి.

ముఖ్యంగా మధుమేహులకు ఖర్జూరం గింజలు ఒక వరం అని చెప్పవచ్చు.మ‌రి ఇంత‌కీ ఖ‌ర్జూరం గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలి.? అవి అందించే ఆరోగ్య లాభాలు ఏంటి.? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Seeds, Seeds Benefits, Seeds Powder, Dates, Tips, Latest-Telugu Health

ముందుగా ఒక కప్పు ఖర్జూరం గింజలు తీసుకుని వాటర్ లో వేసి శుభ్రంగా కడగాలి.ఇలా క‌డిగిన‌ ఖర్జూరం గింజ‌ల‌ను తడి లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఖ‌ర్జూరం గింజ‌లు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి.ఫ్రై చేసుకున్న ఖర్జూరం గింజల‌ను మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ ఖర్జూరం గింజల పొడిని ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో హాఫ్ టేబుల్ స్పూన్ ఖర్జూరం గింజల పొడి, వన్ టేబుల్ స్పూన్ బెల్లం తురుము వేసుకొని బాగా కలిపి సేవించాలి.

Telugu Seeds, Seeds Benefits, Seeds Powder, Dates, Tips, Latest-Telugu Health

ఈ విధంగా ఖర్జూరం గింజల పొడిని తీసుకుంటే రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది.నిద్రలేమి సమస్య దూరం అవుతుంది.బ్యాడ్ కొలెస్ట్రాల్(Bad Cholesterol ) కరుగుతుంది.గుండె ఆరోగ్యంగా( Heart Health ) మారుతుంది.ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది.మెదడు మునుపటి కంటే చురుగ్గా మారుతుంది.

జ్ఞాపకశక్తి, ఆలోచన శక్తి రెట్టింపు అవుతాయి.

Telugu Seeds, Seeds Benefits, Seeds Powder, Dates, Tips, Latest-Telugu Health

అలాగే మధుమేహం ఉన్నవారు ఒక గ్లాస్ వాటర్ లో హాఫ్ టేబుల్ స్పూన్ ఖర్జూర గింజల పొడిని ఐదు నిమిషాల పాటు మరిగించి ఫిల్టర్ చేసుకుని సేవించాలి.ఈ విధంగా ప్రతి రోజు చేస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.మరియు వెయిట్ లాస్ కూడా అవుతారు.

కాబట్టి ఇన్ని ఆరోగ్య లాభాలను అందించే ఖర్జూరం గింజల‌ను ఇకపై అస్సలు పారేయకండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube