1.చంద్రబాబు బెయిల్ పై రఘురామ కామెంట్స్

టిడిపి అధినేత చంద్రబాబు గురువారం కోర్టులో బెయిల్ లభిస్తుందని నరసాపురం ఎంపీ రఘురాం కృష్ణంరాజు ఆశాభావం వ్యక్తం చేశారు.
2.అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని టిడిఎల్పి నిర్ణయం
అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని టీడిఎల్పి తాజాగా జరిగిన సమావేశం లో నిర్ణయం తీసుకుంది.
3.పోలీసులపై ఎమ్మెల్యే వెలగపూడి విమర్శలు

పోలీసులు వైసీపీ కండువాలు కప్పుకుని ఉద్యోగాలు చేస్తున్నారని విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు విమర్శించారు.
4.మహిళా రిజర్వేషన్ బిల్లు వెంటనే అమలు చేయాలి
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని , లేదంటే వారికి అన్యాయం జరుగుతుందని సోనియాగాంధీ అన్నారు.
5.నోటీసులపై అయ్యన్న వివరణ

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్ర సభలో జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మాజీమంత్రి పేర్ని నాని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలో అయ్యన్నకు హనుమాన్ జంక్షన్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.దీనిపై వివరణ ఇచ్చేందుకు హనుమాన్ జంక్షన్ సిఐ కార్యాలయానికి అయ్యన్న వెళ్లారు.
6.నవదీప్ పిటిషన్ హైకోర్టులో విచారణ
హీరో నవదీప్ పిటిషన్ హైకోర్టులో విచారణ జరిగింది.నవదీప్ పై గతంలోనూ డ్రగ్స్ కేసులు ఉన్నాయని హైకోర్టుకు పోలీసులు తెలిపారు.
7.చంద్రబాబు అక్రమ అరెస్టుపై కొనసాగుతున్న నిరసనలు

టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ పై నిరసనలు కొనసాగుతున్నాయి.
8.నేడు రేపు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ
కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ బుధ, గురువారాల్లో సమావేశం కానుంది.
9.నేడు రేపు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ

కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ బుధ, గురువారాల్లో సమావేశం కానుంది.
10.టిడిఎల్పి సమావేశంలో లోకేష్
టిడిపి సమావేశం ఈరోజు మంగళగిరి పార్టీ కార్యాలయంలో ప్రారంభం అయ్యింది.జూమ్ కాన్ఫి రెన్స్ ద్వారా లోకేష్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
11.చంద్రబాబు విడుదల కోరుతూ.

టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ త్వరలోనే ఆయన విడుదల కావాలని కోరుతూ బెంగళూరు తెలుగుదేశం ఫోరం ఆధ్వర్యంలో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
12.చెన్నై బిట్రగుంట రైళ్ల రద్దు
విజయవాడ డివిజన్ పరిధిలో మరమ్మత్తులు చేపడుతున్న కారణంగా చెన్నై బిట్రగుంట రైళ్లు ఈనెల 22 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
13.25 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం

గచ్చిబౌలిలో 25 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభించారు.
14.అంగన్వాడీల ఆందోళన
తెలంగాణలో కనీస వేతనం కోసం అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు .తెలంగాణ వ్యాప్తంగా కలెక్టరేట్లను ముట్టడించారు.
15.ఆర్టీసీ ఉద్యోగుల విలీనం గెజిట్ విడుదల

టిఎస్ఆర్టిసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ సర్కార్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
16.రేవంత్ రెడ్డి కామెంట్స్
తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని కాంగ్రెస్ గ్యారంటీలతో బీఆర్ఎస్ నేతలు వ్యక్తం అవుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
17.ఎంఐఎం మహిళా ద్రోహి : బండి సంజయ్

మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన ఎంఐఎం మహిళా ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతుందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు.
18.తెలంగాణలో నేడు రేపు వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నేడు , రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
19.ఏడుగురు వైద్య విద్యార్థులపై సస్పెన్షన్ వేటు

మెడికల్ జూనియర్ విద్యార్థి పై దాడి ఘటనలో కాకతీయ వైద్య కళాశాల కీలక నిర్ణయం తీసుకుంది .ర్యాగింగ్ కు పాల్పడిన ఏడుగురు విద్యార్థులపై సస్పెన్షన్ విధిస్తూ యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
20.రజాకార్ సినిమాను నిషేధించాలి
బిజెపి నేతల ఆధ్వర్యంలో విడుదలకు సిద్ధమైన రజాకార్ సినిమాను నిషేధించాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.